Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివగామి పాత్ర రమ్యకృష్ణకే రాసి పెట్టి వుంది..ఆ పాత్రలో రమ్య జీవించింది: మధుబాల

''అల్లరిప్రియుడు" సినిమాలో రమ్యకృష్ణతో కలిసి నటించిన మధుబాల గుర్తుందా? ఈమె 'రోజా' సినిమాలో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. అయితే సెకండ్ ఇన్నింగ్స్ మాత్రం ఆమెకు అంతగా కలిసిరాలేదు. దీంతో చేతికంద

Webdunia
శనివారం, 15 జులై 2017 (16:09 IST)
''అల్లరిప్రియుడు" సినిమాలో రమ్యకృష్ణతో కలిసి నటించిన మధుబాల గుర్తుందా? ఈమె 'రోజా' సినిమాలో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. అయితే సెకండ్ ఇన్నింగ్స్ మాత్రం ఆమెకు అంతగా కలిసిరాలేదు. దీంతో చేతికందిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్న మధుబాల.. బాహుబలిలో రమ్యకృష్ణ పాత్ర గురించి నోరువిప్పింది. 
 
తన సహనటి అయిన రమ్యకు శివగామి ద్వారా మరింత హైప్ పెరగడం పట్ల హర్షం వ్యక్తం చేసింది. బాహుబలి కథ ఆధారంగా తెరకెక్కుతోన్న ఆరంభ్ ధారావాహికలో రమ్యకృష్ణ పాత్రను మధుబాల పోషిస్తోంది. బాహుబలి సినిమాలో రమ్య పోషించిన శివగామి పాత్రను.. సీరియల్‌తో తాను చేస్తుండటం గర్వంగా ఉందని మధుబాల చెప్పింది. 
 
పనిలో పనిగా శివగామి పాత్ర కోసం శ్రీదేవిని సంప్రదించడంపై కూడా స్పందించింది. శివగామి పాత్ర రమ్యకృష్ణ చేయాలని రాసివుంది. అందుకే ఆ పాత్ర ఆమెను వెతుక్కుంటూ వచ్చిందని మధుబాల వ్యాఖ్యానించింది. ఆ పాత్రలో రమ్య జీవించిందని.. ఏ పాత్రనైనా ఆమె అవలీలగా పండిస్తుందనే సంగతి తనకు బాగా తెలుసునని మధుబాల పేర్కొంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

జమిలి బిల్లు: భారత రాజ్యాంగాన్ని బలహీనపరుస్తోంది.. వైఎస్ షర్మిల

ఆస్తి కోసం అన్నదమ్ములను చంపేసిన చెల్లి!!

జేపీసీకి జమిలి బిల్లు... కమిటీలో ప్రియాంకా గాంధీ!!

ఆప్ మరో కీలక హామీ : ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచిత వైద్యు

భారత్‌కు పన్నుపోటు తప్పదు : హెచ్చరించిన డోనాల్డ్ ట్రంప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

తర్వాతి కథనం
Show comments