Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరు - పవన్‌లు కత్తులు దూసుకోవాలి.. విడిపోవాలని కోరుకుంటున్నారు : తమ్మారెడ్డి విమర్శ

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నంబర్ 150' ప్రీరిలీజ్ ఫంక్షన్ శనివారం గుంటూరు వేదికగా హాయ్‌ల్యాండ్‌లో జరుగనుంది. అయితే, ఈ ఫంక్షన్‌కు పవన్ కల్యాణ్ వస్తారా? రారా? అనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొ

Webdunia
శనివారం, 7 జనవరి 2017 (10:31 IST)
మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నంబర్ 150' ప్రీరిలీజ్ ఫంక్షన్ శనివారం గుంటూరు వేదికగా హాయ్‌ల్యాండ్‌లో జరుగనుంది. అయితే, ఈ ఫంక్షన్‌కు పవన్ కల్యాణ్ వస్తారా? రారా? అనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పవన్ రావడం లేదంటూ నిర్మాత అల్లు అరవింద్ ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు తన వదిన, చిరంజీవి సతీమణి సురేఖ పవన్‌ను ఆహ్వానించేందుకు స్వయంగా వెళుతున్నారనే వార్తలు కూడా వెలువడ్డాయి. ఈ క్రమంలో, సోషల్ మీడియాలో పలురకాలైన కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. 
 
వీటిపై దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ 'నా ఆలోచనలు' పేరిట యూట్యూబ్‌లో ఆయన ఓ వీడియోను అప్ లోడ్ చేశారు. చిరంజీవి, పవన్ కల్యాణ్‌ల భావజాలాలు వేర్వేరుగా ఉన్నంత మాత్రాన వారిద్దరూ విడిపోవాలి, కత్తులు దూసుకోవాలి అనే రీతిలో సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారంటూ తమ్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ఇలాంటి పోస్టుల్, కామెంట్స్ చేస్తున్న వారు... చిరంజీవి లేకపోతే పవన్ లేడనే విషయాన్ని గుర్తించాలని... 'ఖుషి' సినిమా హిట్ అయిన తర్వాత పవన్ గురించి చిరంజీవి చాలా గొప్పగా చెప్పుకున్నారన్నారు. 'డాడీ' సినిమాలో పవన్ కంపోజ్ చేసిన ఫైట్‌ను వాడుకున్నారని చెప్పారు. అన్న చిరంజీవి అంటే పవన్‌కు ఎంతో ఇష్టమని తెలిపారు. 
 
రాజకీయపరంగా కొన్ని అభిప్రాయభేదాలు ఉన్నంత మాత్రాన వారిద్దరి మధ్య ఏదో జరుగుతోందని అనడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. వారిద్దరూ విడిపోతేనే బాగుంటుందనేది నెటిజన్ల అభిప్రాయంలా ఉందని అన్నారు. వీలైతే కలిపే ప్రయత్నం చేయాలి కానీ... విడగొట్టే పని మాత్రం చేయొద్దని నెటిజన్లకు హితవు పలికారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అంబులెన్స్‌కు దారివ్వని కారు డ్రైవర్.. రూ.2.5 లక్షల అపరాధం.. లైసెన్స్ రద్దు.. (Video)

'విశ్వ సుందరి'గా డెన్మార్క్ అందాల భామ

ఆవు పేడ కుప్పలో రూ.20 లక్షల నోట్లు

గుంటూరు మేయరుపై కేసు నమోదు... అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు

లేడీ టీచర్ కుర్చీ కింద బాంబు అమర్చి రిమోట్‌తో పేల్చిన విద్యార్థులు.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

తర్వాతి కథనం
Show comments