చెన్నైలో మరోనటి ఆత్మహత్యకు పాల్పడింది. నటీమణులపై వేధింపులు పెచ్చరిల్లిపోతున్న నేపథ్యంలో యాంకర్ ప్లస్ నటి అయిన సబర్ణ ఆత్మహత్యకు పాల్పడింది. చెన్నైలోని మదురవాయల్‌లో తన ప్లాటులో ఆమె శవంగా పడి ఉండటాన్ని ప
చెన్నైలో మరోనటి ఆత్మహత్యకు పాల్పడింది. నటీమణులపై వేధింపులు పెచ్చరిల్లిపోతున్న నేపథ్యంలో యాంకర్ ప్లస్ నటి అయిన సబర్ణ ఆత్మహత్యకు పాల్పడింది. చెన్నైలోని మదురవాయల్‌లో తన ప్లాటులో ఆమె శవంగా పడి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. సబర్ణ బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కూడా మెరిసింది. చిన్న చిన్న పాత్రలు పోషించినా మంచి గుర్తింపు సాధించింది. అయితే మూడు రోజుల పాటు ఆమె ఫ్లాట్ తలుపులు మూసే వుండటంతో పాటు గదిలో దుర్వాసన కూడా రావడంతో పక్కింటివారు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు చేరుకుని తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లగా, గదిలో సబర్ణ మృతదేహం కనిపించడంతో షాక్ అయ్యారు. సబర్ణ ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా సబర్ణ సూసైడ్ వ్యవహారం కోలీవుడ్‌ని దిగ్ర్భాంతికి గురిచేసింది. కోయంబత్తూరుకు చెందిన సబర్ణ తమిళ టీవీ ఛానెల్స్‌లో యాంకర్‌గా ప్రేక్షకులను మెప్పించి తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఆపై సినిమాల్లోనూ అడపాదడపా క్యారెక్టర్లు చేసుకుంటూ వచ్చింది. కానీ ఇంతలోపే ఆమె ఆత్మహత్యకు పాల్పడటానికి కారణం మాత్రం తెలియరాలేదు.