Webdunia - Bharat's app for daily news and videos

Install App

లేటు వయసులో కుర్రకారు హీరోయిన్లతో పోటీపడుతున్న తమిళ నటి

'దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాల'న్న ప్రధాన ఉద్దేశ్యంతో పలువురు హీరోయిన్లు వెండితెరపై అందాలను ఆరబోసేందుకు ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. ఈ కోవలో పాతతరం, కొత్తతరం అనే తేడా లేకుండా హీరోయిన్లు అందాల ఆరబో

Webdunia
మంగళవారం, 5 జూన్ 2018 (12:20 IST)
'దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాల'న్న ప్రధాన ఉద్దేశ్యంతో పలువురు హీరోయిన్లు వెండితెరపై అందాలను ఆరబోసేందుకు ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. ఈ కోవలో పాతతరం, కొత్తతరం అనే తేడా లేకుండా హీరోయిన్లు అందాల ఆరబోతకు పోటీపడుతున్నారు.
 
ఇందులోభాగంగా, నిన్నటితరం తారల్లో ఒకరైన కస్తూరి లేటు వయసులో అందాల ఆరబోస్తోంది. తన సినీ కెరీర్ ఆరంభంలో మంచి నటిగా గుర్తింపు పొందిన ఈమె.. ఆ తర్వాత వెండితెరకు దూరమై బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. పలు కుటుంబ కథా పాత్రల్లో నటించి కుటుంబ ప్రేక్షకులకు చేరువైంది. 
 
ఇటీవలే తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆమె... గతానికి పూర్తి భిన్నమైన పాత్రల్లో కనిపిస్తూ ఆమె అభిమానుల్ని సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గతేడాది డిజాస్టర్‌గా మిగిలిన "ఏఏఏ" చిత్రంలో ఇంటర్‌పోల్‌ ఆఫీసర్‌గా నటించినా, ఆరంభ సన్నివేశాల్లో ఆమె ఆహార్యం చూసి జనాలు ముక్కున వేలేసుకున్నారు. 
 
ఇప్పుడు "తమిళపడం 2.0"లో వాన పాటలో నటించి యూత్‌లో హీట్‌ పెంచింది. ఇటీవలే విడుదలైన టీజర్‌లో కస్తూరి వాన పాటను చూసి పలువురు ఔరా అంటూనే.. ఆమెపై విమర్శలు కూడా చేస్తున్నారు. ఈ వయసులో, అందులోనూ ఒక బిడ్డకు తల్లిగా ఉన్న ఆమె ఐటమ్‌ సాంగ్స్‌లో నటించమేంటని ఛీ కొడుతున్నారు. ఈ కామెంట్స్‌పై కస్తూరి ఘాటుగానే స్పందించింది కూడా.. తల్లి అయితే ఐటమ్‌ సాంగ్స్‌ చేయకూడదన్న రూలేమైనా ఉందా అంటూ ప్రశ్నించడంతో విమర్శలు చేసినవారంతా నోరు మూసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అచ్చం మనిషిలా మారిపోయిన వానరం.. ఎలాగంటే? (Video)

ఈ మంత్రి పదవి జనసేనాని భిక్షే : మంత్రి కందుల దుర్గేశ్

'హాల్ ఆఫ్ ఫేమ్‌'లో భారత సంతతి కుర్రోడు

Seize The Ship: ట్విట్టర్‌లో ట్రెండింగ్‌.. అంతా పవన్ ఎఫెక్ట్

బిర్యానీ కావాలని మారాం చేసిన పిల్లలు... ప్రాణాలు కోల్పోయిన ఐటీ దంపతులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments