Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను పెద్ద అందగత్తెను కాదు.. కానీ గట్టి గుండె : ఖుష్బు

Webdunia
మంగళవారం, 13 అక్టోబరు 2020 (21:22 IST)
తమిళ సినీ నటి ఖుష్బూ సుందర్ కాంగ్రెస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆమె కాషాయదళ సభ్యత్వం స్వీకరించారు. నిన్నామొన్నటివరకు తీవ్రమైన స్థాయిలో విమర్శలు గుప్పించిన పార్టీలో ఖుష్బూ చేరడం తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. 
 
ఈ నేపథ్యంలో ఆమె ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ, తాను కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకోవడాని గల కారణాలను వివరిస్తూ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి వివరణాత్మకంగా లేఖ రాసినట్టు చెప్పారు. 
 
ముఖ్యంగా, హస్తానికి గుడ్‌బై చెప్పడానికి కారణం ఆ పార్టీ నడుస్తున్న తీరు సరిగా లేకపోవడమేనన్నారు. 'కాంగ్రెస్ పార్టీ మారిపోయింది, ఆ పార్టీలో నేతలు మారిపోయారు' అని వ్యాఖ్యానించారు. అంతకుమించి తన నిష్క్రమణకు గల కారణాలను వివరించలేనని తెలిపారు.
 
నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు తనకు బాధ్యతలు అప్పగించడంపై కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతోందని, కానీ గత నాలుగేళ్లుగా స్థానిక నేతలు తనతో ఎలా ప్రవర్తిస్తున్నదీ చెబుతూనే ఉన్నానని, దానిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు.
 
జ్యోతిరాదిత్య సింథియా వెళ్లిపోయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఇలాగే చెప్పిందని అన్నారు. ఇక తమిళనాడు కాంగ్రెస్ చీఫ్ కేఎస్ అళగిరి తనను తామరాకుపై నీటిబొట్టు అని అభివర్ణించడం పట్ల ఖుష్బూ స్పందించారు. ఇలాంటి స్త్రీద్వేష వ్యాఖ్యల గురించే తాను మొదట్నించి చెబుతున్నానని స్పష్టం చేశారు.
 
'ముఖ్యంగా, నేను ఓ నటినే కావచ్చు. కానీ అళగిరి ఎవరికీ పెద్దగా తెలియని వ్యక్తి. నేను ప్రజలను ఆకర్షించగలను. అళగిరి నాలా జనాకర్షక శక్తి ఉన్న నేత కాదు. అందుకే, తమకంటే తెలివైన, వాక్పటిమ ఉన్న మహిళను ఈ విధంగా ఎదుర్కోవాలని ప్రయత్నించారు. విధేయత గురించి మాట్లాడడం ఇక వృథా. నాది గట్టి గుండె. నేను అందగత్తెనే కాదు, తెగువ ఉన్నదాన్ని కూడా" అంటూ తనదైన శైలిలో చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments