Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ బయోపిక్ : జయప్రదగా మిల్కీబ్యూటి

Webdunia
గురువారం, 11 అక్టోబరు 2018 (17:43 IST)
నందమూరి బాలకృష్ణ, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకురానున్న ఈ చిత్రాన్ని స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మొదటి భాగం జనవరి 9వ తేదీన రిలీజ్‌కానుంది.
 
అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పలువురు సీనియర్ నటీనటుల పాత్రల్లో నేటి తరం హీరో హీరోయిన్లు నటిస్తున్నారు. ముఖ్యంగా, అలనాటి అందాల హీరోయిన్లు శ్రీదేవి, జయప్రద వంటి పాత్రల్లో టాలీవుడ్ యంగ్ కథానాయికలను ఎంపిక చేస్తున్నారు. 
 
ఈ కోవలో ఇప్పటికే శ్రీదేవి పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్‌ను ఎంపిక చేయగా, ఇపుడు జయప్రద రోల్‌ కోసం మిల్కీ బ్యూటీ తమన్నాను ఎంపిక చేసినట్టు సమాచారం. నిజానికి ఎన్టీఆర్ చిత్రాల్లో జ‌య‌ప్ర‌ద‌కి కూడా ప్ర‌త్యేక స్థానం ఉంది. ఇప్పుడు ఆమె పాత్ర కోసం మిల్కీ బ్యూటీ తమ‌న్నాని ఎంపిక చేసిన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి.
 
ఎన్టీఆర్ - జ‌య‌ప్ర‌ద కాంబినేష‌న్‌లో వ‌చ్చిన 'సూపర్‌ మ్యాన్', 'అడవి రాముడు', 'చాణక్య చంద్రగుప్తా', 'యమగోల' చిత్రాలు భారీ విజ‌యం సాధించాయి. ఈ క్ర‌మంలో ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో జ‌య‌ప్ర‌ద పాత్ర‌ని చేర్చాల‌ని టీం భావించ‌గా త‌మ‌న్నా ఆ పాత్రకి స‌రిపోతుంద‌ని అనుకుంటున్నార‌ట‌. దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది.
 
కాగా, ప్రస్తుతం తమన్నా "ఎఫ్ 2" అనే మ‌ల్టీ స్టార‌ర్‌లో విక్టరీ వెంకటేష్ సరసన నటిస్తోంది. దీంతో పాటు కునాల్ కోహ్లి డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కుతున్న సినిమాతో పాటు చిరంజీవి ""సైరా", హిందీలో "ఖామోషి", త‌మిళ్‌లో "క‌న్నె క‌లైమాని" అనే సినిమాలు చేస్తుంది. రీసెంట్‌గా 'ద‌టీజ్ మ‌హాల‌క్ష్మీ' అనే సినిమా చిత్రీక‌ర‌ణకి గుడ్ బై చెప్పింది ఈ మిల్కీ బ్యూటీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments