ప్రశాంత్ నీల్ బాహుబలికి ఓటేస్తే.. తమన్నాతో రాక్కీ భాయ్ రొమాన్స్

Webdunia
శనివారం, 13 మార్చి 2021 (20:22 IST)
yash
కేజీఎఫ్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన యశ్.. ప్రస్తుతం కేజీఎఫ్ చాప్టర్-2తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాకు తర్వాత కేజీఎఫ్ ఎవరితో సినిమా చేయబోతున్నాడనే విషయాన్ని శనివారం తేల్చేశాడు. కన్నడ టాలెంటెడ్ డైరెక్టర్ తన కేజీఎఫ్ ఛాప్టర్ 2కు తర్వాత నెక్ట్స్ హీరోగా మన 'బాహుబలి'ని ఎంచుకున్నాడు.
 
అలాగే రాకీ భాయ్ నెక్ట్స్ 'బాహుబలి' హీరోయిన్‌తో రొమాన్స్ చేయబోతున్నాడట. 'కేజీఎఫ్‌'తో దేశవ్యాప్త పేరు, ప్రఖ్యాతులు పొందారు ప్రశాంత్ నీల్, యశ్. 'కేజీఎఫ్‌ 2' తరువాత రాకింగ్ స్టార్ మరో టాలెంటెడ్ కన్నడ డైరెక్టర్‌కే ఛాన్స్ ఇవ్వనున్నాడట. 
 
'మఫ్టీ' సినిమాతో సూపర్ హిట్ ఎంట్రీ ఇచ్చిన యంగ్ డైరెక్టర్ నర్తన్ లక్కీ ఛాన్స్ కొట్టేశాడు. నిజానికి డైరెక్టర్ నర్తన్ శాండల్ వుడ్ సీనియర్ హీరో శివరాజ్ కుమార్‌తో సినిమా చేయాల్సి ఉంది. ఆయనతో ప్రాజెక్ట్ కొన్నాళ్లు వాయిదాపడటంతో యశ్ వద్దకి చేరిపోయాడు.
 
వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతోన్న సినిమాకి 'జటస్య' అనే టైటిల్ అనుకుంటున్నారట. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలైపోయాయి. మరోసారి యశ్ ప్యాన్ ఇండియా సబ్జెక్ట్‌నే జనం ముందుకు తీసుకురాబోతున్నాడు. అందుకు తగ్గట్టే ఆయన సరసన తమన్నా కథానాయికగా నటించనుందట. 
 
తెలుగు, తమిళ, హిందీ ప్రేక్షకులకి ఇప్పటికే ట్యామీ ఫేవరెట్ హీరోయిన్. ఇక యశ్ నెక్ట్స్ మూవీతో కన్నడ జనం ముందుకి కూడా ఫుల్ లెంగ్త్ రోల్‌లో వెళ్లనుంది తమ్మూ. అయితే, 'బాహుబలి'లో అందాల అవంతికగా కనువిందు చేసిన ఆమె గతంలోనే... యశ్‌తో 'కేజీఎఫ్‌'లోనూ... స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మావోయిస్టు పార్టీకి మరో దెబ్బ... టెక్ శంకర్ ఎన్‌కౌంటర్

గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు... 22 మంది మృత్యువాత

ఏపీ లిక్కర్ స్కామ్ : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తుల జప్తు

ఏపీకి పొంచివున్న మరో తుఫాను గండం ... రానున్నరోజుల్లో భారీ వర్షాలే

కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఇకపై కొనసాగలేను : డీకే శివకుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments