Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జయమ్మ ఎక్కడో రాకుమార్తెగా పుట్టివుంటారు.. నన్ను అలా కాపాడారు.. విజయమ్మ

జయమ్మ ఎక్కడో రాకుమార్తెగా పుట్టివుంటారు.. నన్ను అలా కాపాడారు.. విజయమ్మ
, బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (22:18 IST)
Jaya_Vijaya
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జన్మదినం సందర్భంగా భారతీయ జనతా పార్టీ నేత, సినీనటి విజయశాంతి శుభాకాంక్షలు తెలుపుతూ.. ఫేస్‌బుక్ ఖాతాలో జయలలితతో స్నేహం, ఆప్యాయత, అభిమానం, తనకు జీవితకాలపు కానుకలని ఆమె కొనియాడారు. క్లిష్ట పరిస్థితుల్లో ఆమె తనను కాపాడారని గుర్తు చేసుకున్నారు. ఒకానొక సందర్భంలో ఇస్లామిక్ తీవ్రవాదుల హిట్ లిస్టులో టార్గెట్ అయినప్పుడు కొన్ని సంవత్సరాల పాటు జయలలిత భద్రత కల్పించారని గుర్తు చేసుకున్నారు.
 
ఇంకా విజయమ్మ తన అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతాలో జయలలితతో తీసుకున్న ఒక చిత్రాన్ని షేర్ చేశారు. అలాగే ఇలా రాసుకొచ్చారు. ''అమ్మా... మీరెక్కడో రాజకుమార్తెగా మళ్ళీ జన్మించే ఉంటారు. అయినప్పటికీ మాకందరికీ తెలిసిన రోజుగా మీకివే పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు పంచిన స్నేహం, అభిమానం, ఆప్యాయత నాకు జీవితకాలపు కానుకలుగా... తీపి గుర్తులుగా ఎప్పటికీ అలాగే ఉంటాయి. మత తీవ్రవాదుల హిట్ లిస్టులో నేను టార్గెట్ అయినప్పుడు కొన్ని సంవత్సరాల పాటు మీరు నా భద్రత కోసం తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ ఇంకా గుర్తున్నాయని తెలిపారు. ఇంకా... పురట్చి తలైవియిన్ అన్బు తంగై.... ప్రచార బీరంగి అంటూ మీరు నాకిచ్చిన గౌరవప్రదమైన పిలుపులు ఈ జన్మంతా జ్ఞాపకాలుగా మిగిలే ఉంటాయి. ఎప్పటికీ...'' అని రాసుకొచ్చారు.
 
ఇకపోతే.. బీజేపీ జాతీయ నాయకుడు ఎల్ కే అద్వానీ 1998లో తమిళనాడులోని కోయంబత్తూరులో పర్యటించినప్పుడు ఆయనపై బాంబు దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ నాయకురాలైన విజయశాంతి అప్పుడు తమిళనాడులో బీజేపీ నాయకురాలిగా జాతీయనేతలతో కలసి పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నారు. 
webdunia
Jaya_Vijaya
 
అద్వానీపై బాంబు దాడి కేసులో ప్రధాన నిందితుడైన ఉగ్రవాది మదానీ డైరీలో తన టార్గెట్‌గా రాసుకున్న పేర్లలో ఎల్ కే అద్వానీ తర్వాత విజయశాంతి పేరు రెండవదిగా ఉన్నట్లు దర్యాప్తులో బయటపడింది. దాంతో అప్పటి తమిళనాడు సీఎం జయలలిత ప్రత్యేక శ్రద్ధ తీసుకుని విజయశాంతి నివాసం వద్ద, ఆమె పర్యటనల్లోనూ డాగ్ స్క్వాడ్, బాంబు డిటెక్షన్ స్క్వాడ్‌లతో పాటు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేను పార్టీ పెట్టడం అన్న జగన్‌కు ఇష్టం లేదు.. కేసీఆర్, విజయమ్మ ఎక్కడ పుట్టారు?