కపిల్ శర్మతో ఫిరంగ్‌లో రొమాన్సా..? అవన్నీ వదంతులే.. ట్విట్టర్లో క్లారిటీ ఇచ్చిన అవంతిక..
విశాల్ సరసన తమన్నా నటించిన 'ఒక్కడున్నాడు' చిత్రం ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న 'బాహుబలి: ది కన్‌క్లూజన్' చిత్రంలో ఆమె ప్రధాన పాత్రలో నటిస్తోంద
విశాల్ సరసన తమన్నా నటించిన 'ఒక్కడున్నాడు' చిత్రం ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న 'బాహుబలి: ది కన్‌క్లూజన్' చిత్రంలో ఆమె ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ నేపథ్యంలో కపిల్ శర్మ కథానాయకుడిగా తెరంగేట్రం చేస్తున్న "ఫిరంగ్'' సినిమాలో తమన్నా నటిస్తోందని సోషల్ మీడియాలో వార్తలు పుట్టుకొస్తున్నాయి.
అయితే ఈ వార్తలపై తమన్నా స్పందించింది. ఫిరంగ్ సినిమాలో తాను నటించట్లేదని ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చింది. తాను సంతకం చేసిన సినిమాల గురించి.. నటించేందుకు ఓకే చెప్పిన సినిమాల గురించి తానే మాట్లాడుతానని.. దయచేసి పుకార్లను ప్రోత్సహించకండి అంటూ తమన్నా ట్వీట్ చేశారు.
కాగా కమెడియన్ కపిల్ శర్మ హీరోగా రూపుదిద్దుకోనున్న ఫిరంగ్ సినిమాలో తమన్నా, ఇషితా దత్తా నటిస్తున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. కపిల్ శర్మ స్క్రిప్ట్ రెడీ చేసిన ఈ సినిమాకు సంబంధించిన ప్రీ పొడక్షన్ పనులు జరుగుతున్నాయని బిటౌన్‌లో ప్రచారం సాగుతోంది. నవంబర్ 25 నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని టాక్ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో తాను నటించట్లేదని తమన్నా క్లారిటీ ఇచ్చింది.