Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీవితంలో లవ్ ఫెయిల్యూర్ - హార్ట్ బ్రేక్‌‍లు ఉన్నాయి : మిల్కీ బ్యూటీ

ఠాగూర్
మంగళవారం, 10 సెప్టెంబరు 2024 (09:34 IST)
తన జీవితంలో కూడా లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నాయని మిల్కీబ్యూటీ అన్నారు. దక్షిణాదిలో ఈ భామకు అవకాశాలు తగ్గిపోవడంతో బాలీవుడ్‌పై దృష్టిసారించింది. అక్కడ సినిమాలతో పాటు వెబ్‌సిరీస్‌‍లలో నటిస్తూ ఎంతో బిజీగా ఉంటుంది. అదేసమయంలో ఐటెం సాంగులతో ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ తన జీవితానికి సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది.
 
తన జీవితంలో రెండు లవ్ ఫెయిల్యూర్లు (హార్ట్ బ్రేక్స్) ఉన్నాయని తమన్నా తెలిపింది. టీనేజ్‌లో ఉన్నప్పుడు తాను ప్రేమలో పడ్డానని... అయితే ఆ లవ్ ఎక్కువ కాలం కొనసాగలేదని చెప్పింది. ఆ సమయంలో తాను ఏదో సాధించాలనే తపనతో ఉన్నానని... ఒక వ్యక్తి కోసం తన జీవితాన్ని వదులుకోవాలనిపించలేదని తెలిపింది. ఆ విధంగా తాను తొలి హార్ట్ బ్రేక్‌ను ఎదుర్కొన్నానని వెల్లడించింది. 
 
ఆ తర్వాత తాను మరొక వ్యక్తితో ప్రేమలో పడ్డానని... ఆ ప్రేమ కూడా ఎక్కువ కాలం కొనసాగలేదని గుర్తుచేసింది. ప్రతి విషయానికి అతను అబద్ధం చెప్పేవాడని... దీంతో, ఆ వ్యక్తితో బంధాన్ని తాను కంటిన్యూ చేయలేకపోయానని చెప్పింది. ఆ విధంగా తాను రెండో హార్ట్ బ్రేక్‌‍ను ఎదుర్కొన్నానని తెలిపింది. మరోవైపు ప్రస్తుతం తమన్నా యాక్టర్ విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుమయాలతో వైకాపా ప్రకాష్ రెడ్డి వీడియో.. హీరోయిన్ ఏమంది? (video)

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments