Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజు గారి గ‌ది 3లో న‌టించేందుకు ఆ హీరోయిన్ ఓకే చెప్పిందా..?

Webdunia
మంగళవారం, 12 మార్చి 2019 (22:07 IST)
జీనియ‌స్ సినిమాతో డైరెక్ట‌ర్‌గా మారిన‌ యాంక‌ర్ ట‌ర్న‌డ్ డైరెక్ట‌ర్ ఓంకార్. ఆత‌ర్వాత ఓంకార్ తెర‌కెక్కించిన హ‌ర్ర‌ర్ కామెడీ మూవీ రాజు గారి గ‌ది. 2015లో రిలీజైన ఈ సినిమాలో అశ్విన్ బాబు, ధ‌న్య‌బాల‌క్రిష్ట‌న్, ధ‌న‌రాజ్, రాజీవ్ క‌న‌కాల ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు.

హ‌ర్ర‌ర్ కామెడీతో పాటు మంచి సందేశాన్ని కూడా అందించిన ఈ సినిమా ప్రేక్ష‌కాద‌ర‌ణ‌తో మంచి విజ‌యాన్నిసాధించింది. ఆ త‌ర్వాత ఈ క‌థ‌కు సంబంధం లేక‌పోయినా రాజు గారి గ‌ది 2 టైటిల్‌తో ఓంకార్ మ‌రో సినిమా తెర‌కెక్కించారు. ఇందులో నాగార్జున‌, స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. 
 
పీవీపీ సినిమా, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్మెంట్స్, ఓఏకే ఎంట‌ర్ టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించాయి. 2017లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన రాజు గారి గ‌ది 2 ఆశించిన స్ధాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయింది. ఆత‌ర్వాత సినిమాల‌కు కొంత గ్యాప్ ఇచ్చి ఓంకార్ టీవీ షోలో బిజీ అయ్యారు. తాజాగా ఇప్పుడు రాజు గారి గ‌ది 3 సినిమా తీయ‌డానికి ఓంకార్ ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం. 
 
ఇటీవ‌ల ఓంకార్ త‌మ‌న్నాకి క‌థ చెప్ప‌డం..క‌థ విని త‌మ‌న్నా ఓకే చెప్పింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. తమ‌న్నా వేరే సినిమాల్లో బిజీగా ఉంది. త‌మ‌న్నా డేట్స్ విష‌యంలో క్లారిటీ వ‌చ్చిన త‌ర్వాత రాజు గారి గ‌ది 3 చిత్రాన్ని అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేయ‌నున్నార‌ని టాక్ వినిపిస్తోంది. మ‌రి...ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త గురించి ఓంకార్ స్పందిస్తాడేమో చూద్దాం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నేను తప్పు చేసానని తేలితే అరెస్ట్ చేస్కోవచ్చు: పోసాని కృష్ణమురళి

కట్టుకున్నోడికి పునర్జన్మనిచ్చిన అర్థాంగి.. కాలేయం దానం చేసింది.. (video)

స్నేహితుడి పెళ్లిలో గిఫ్ట్ ఇస్తూ గుండెపోటుతో కుప్పకూలి యువకుడు మృతి (video)

మహారాష్ట్ర, జార్ఖండ్‌లో గెలుపు ఎవరిది.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయ్.. బీజేపీ?

లోన్ యాప్‌లు, బెట్టింగ్ సైట్‌ల భరతం పడతాం... హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments