Webdunia - Bharat's app for daily news and videos

Install App

షూటింగులో గాయపడిన సీనియర్ నటి టబు

Webdunia
గురువారం, 11 ఆగస్టు 2022 (12:55 IST)
సీనియర్ సినీ నటి టబు సినిమా షూటింగులో గాయపడ్డారు. ఆమె ప్రస్తుతం అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న "భోలా" చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో టబు ఓ కీలకమైన పోలీస్ అధికారిణిగా నటిస్తున్నారు. ఆమెపై హైదరాబాద్ నగరంలో ఛేజింగ్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా, ఈ ప్రమాదం జరిగింది. 
 
ఈ సన్నివేశం చిత్రీకరిస్తుండగా, ట్రక్కు అద్దాలు ఒక్కసారిగా పగిలిపోయాయి. దీంతో టబు నదుటిపైనా, కంటికి దగ్గరగా గాయాలయ్యాయి. అయితే, కంటికి ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో యూనిట్ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
 
గాయపడిన టబును యూనిట్ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. కాగా, గతంలో కూడా సీనియర్ నటి శిల్పాశెట్టి కూడా ఓ వెబ్ సిరీస్ చిత్రీకరణ సమయంలో గాయపడిన విషయం తెల్సిందే. ఓ ఫైట్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా, ఈ ప్రమాదం జరిగింది. 
 
గాయపడిన కోలీవుడ్ నటుడు విశాల్ 
తమిళ హీరో నటుడు విశాల్‌కు గురువారం తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. తన తదుపరి సినిమా 'మార్క్‌ ఆంటోనీ' చిత్రీకరణలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. సినిమాలోని కీలక ఫైట్‌ సీక్వెన్స్‌ చిత్రీకరిస్తున్నప్పుడు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రథమ చికిత్స అనంతరం విశాల్‌ షూట్‌ నుంచి బ్రేక్‌ తీసుకున్నారు.
 
విశాల్‌కు గాయాలు కావడంతో ‘మార్క్‌ ఆంటోనీ’ షూట్‌‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. సోషల్‌ మీడియా వేదికగా ఈ వార్తలు బయటకు రావడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. 
 
ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ పోస్టులు పెడుతున్నారు. ఇక, సినిమాల కోసం విశాల్ ఎలాంటి రిస్క్‌లనైనా తీసుకోవడానికి ముందుంటారు. గతంలోనూ ఆయన పలు సినిమాల షూటింగుల్లో గాయాలపాలయ్యారు. ఇటీవల ‘లాఠీ’ షూట్‌లోనూ ఆయనకు పలుమార్లు గాయాలయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hailstorm: తెలంగాణలో తీవ్రమైన వడగళ్ల వానలు.. తీవ్ర నష్టం.. దెబ్బతిన్న మామిడి తోటలు

కండోమ్‌లలో రూ.11 కోట్ల విలువైన లిక్విడ్ కొకైన్.. బ్రెజిల్ మహిళా ప్రయాణీకురాలి లగేజీలో?

Girl kills Boy: బెర్రీలు తెస్తానని చెప్పి.. నాలుగేళ్ల బాలుడిని హతమార్చిన 13 ఏళ్ల బాలిక

వడను పంచుకున్న సీఎం చంద్రబాబు దంపతులు (video)

మంత్రి ఫరూఖ్‌కు భార్యావియోగం... చంద్రబాబు - పవన్ సంతాపం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments