Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమలో వున్నాను.. కానీ పెళ్లి గురించి ఆలోచించడం లేదు.. తాప్సీ

Webdunia
శనివారం, 12 జూన్ 2021 (14:51 IST)
సొట్ట బుగ్గల చిన్నది తాప్సీ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. ప్రస్తుతం ఫీమేల్ ఓరియెంటెడ్, యాక్షన్ మూవీలతో బాలీవుడ్‌లో అదరగొడుతుంది ఇప్పుడు తాప్సీ. ఈ మధ్య కాలంలో తన ట్వీట్లతో చాలా బోల్డ్ గాను, డేరింగ్ గాను తన అభిప్రాయాలను నిక్కచ్చిగా చెబుతూ... యూత్ ఐకాన్‌గా మారింది. ఇప్పుడు తన లైఫ్ గురించి, తన లవ్ గురించి, ఫ్యామిలీ గురించి చాలా బోల్డ్‌గా ఓపెన్‌గా తన ప్లాన్స్ ఏంటో చెప్పేసింది.
 
చాలా రోజుల నుంచి ఈమె ప్రేమలో ఉందనే విషయం తెలుసు. కాకపోతే ఎవరు అనేది మాత్రం చెప్పలేదు తాప్సీ. తను ప్రేమలో ఉన్నాను.. కానీ ఇండస్ట్రీ మనిషి కాదని మాత్రం ఇదివరకే చెప్పుకొచ్చింది ఈమె. ఈయనెవరో ఇప్పుడు బయటపెట్టింది తాప్సీ. ఆ మధ్య తన ప్రియుడితో కలిసి మాల్దీవులకు కూడా వెళ్లింది. అక్కడ ఎంజాయ్ చేసింది.
 
ఇన్నాళ్ళకు తన ప్రియుడి గురించి చెప్పింది తాప్సీ. తన రిలేషన్‌షిప్ స్టేటస్ గురించి పబ్లిక్‌గా మాట్లాడటానికి తనకేం మొహమాటం లేదని చెప్తుంది ఈ ముద్దుగుమ్మ. తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలు రెండూ పూర్తిగా వేర్వేరుగా ఉంటాయని చెప్పింది.
 
అలాగే ఉంచాలనుకుంటానని.. తనకు సంబంధించిన వాళ్ల పుట్టినరోజుల్లో పాల్గొన్నపుడు ఏదో ఒక స్టిల్‌ను పంచుకుంటానని చెప్పుకొచ్చింది. తన పర్సనల్ లైఫ్‌లో భాగమైన ప్రియుడు మథియాస్ విషయంలో అదే చేశానని చెప్పుకొచ్చింది తాప్సీ.
 
ప్రేమలో ఉన్నాను కానీ పెళ్లి గురించి ఆలోచించడం లేదని చెప్పుకొచ్చింది తాప్సీ . తనకు ఎప్పుడైతే పిల్లలు కనాలని అనిపిస్తుందో అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తానంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది తాప్సీ. అందుకే కెరీర్ పరంగా చాలా బిజీగా ఉంది ఈ భామ. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments