Webdunia - Bharat's app for daily news and videos

Install App

హగ్గులు, ముద్దులు గురించి అడిగారు.. బూతు షో నుంచి నాగ్ వచ్చేయాలి

Webdunia
మంగళవారం, 30 జులై 2019 (17:32 IST)
బిగ్ బాస్ షోకు వ్యతిరేకంగా పోరాడుతోన్న జర్నలిస్ట్, టీవీ యాంకర్ శ్వేతారెడ్డి మరోసారి బిగ్ బాస్ రియాల్టీ షోపై మరోసారి విరుచుకుపడ్డారు. బిగ్‌బాస్ ఎంపిక విషయంలో అన్యాయాలు చాలా జరిగాయని.. వాళ్లు లేవదీసిన ప్రశ్నలు కూడా చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని శ్వేతారెడ్డి చెప్పారు. 
 
తన వద్ద బిగ్ బాస్‌ను ఎలా శాటిసి‌ఫై చేస్తారని అడిగారని.. న శరీరం, బరువు గురించి ప్రశ్నలు అడగడం చాలా ఇబ్బందిగా అనిపించిందని శ్వేతారెడ్డి తెలిపారు. అదొక రియాలిటీ షో, టాలెంట్ షో. అక్కడ ఎవరి టెంపర్ ఎలా ఉంటుంది.. మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది.. టాస్క్‌లు ఇచ్చినప్పుడు వాళ్ల రియాక్షన్ ఎలా ఉంటుంది.. వీటిపై ప్రశ్నలు సంధించాలి. అంతేకానీ.. సెక్సుల గురించి, హగ్గుల గురించి, ముద్దుల గురించి అడగడమేంటని ప్రశ్నించింది. 
 
90 రోజులపాటు సెక్స్ లేకుండా మీరు ఎలా మేనేజ్ చేయగలరని అడిగారని శ్వేతారెడ్డి మండిపడ్డారు. హౌజ్‌లోని వేరే వ్యక్తితో మీరు ముద్దులు పెట్టుకోవడానికి, హగ్స్ ఇచ్చుకోవడానికి, ఎఫైర్ పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? అంటూ ప్రశ్నలేశారని అడిగారు. 
 
తనతో పాటు గాయత్రి గుప్తాను, శ్రీరెడ్డిని కూడా ఈ ప్రశ్నలు అడిగారు. తన విషయంలో శ్యామ్ ఇలాంటి ప్రశ్నలు అడిగితే.. మిగిలిన వాళ్లను ముంబై హెడ్ అభిషేక్ గుప్తా అడిగారు. ఈ పోరాటం చాలా తీవ్ర రూపం దాల్చబోతోందని హెచ్చరించారు.  
 
అంతేగాకుండా ఈ షోకు హోస్ట్‌గా ఉన్న అక్కినేని నాగార్జునకు కూడా శ్వేతారెడ్డి ప్రశ్నలు సంధించారు. ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న నాగార్జున ఇలాంటి షోకు బ్రాండింగ్ ఇస్తూ సభ్యసమాజానికి ఆయన ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారని ప్రశ్నించారు. అన్నమయ్య, శ్రీరామదాసు వంటి గొప్ప సినిమాలు చేసిన నాగార్జున ఈ బూతు షో నుంచి బయటికి రావాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan Letter: డీలిమిటేషన్ ప్రక్రియతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం.. మోదీకి జగన్ లేఖ

రాజకీయ అధికారం తాత్కాలికమే.. ఎన్నికల కాలానికే పరిమితం.. జగన్ అర్థం చేసుకోవాలి?

పోసాని కృష్ణ మురళికి బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు

Navy Officer Murder Case: వెలుగులోకి షాకింగ్ నిజాలు.. మృతదేహంపైనే నిద్ర..

అమరావతిలో అతిపెద్ద అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం... కేశినేని శివనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం