Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ మాటలు వైసీపీ ఉగ్రశిక్షణ ప్రభావం.. జనసేనలో చేరుతా : 'థర్టీ ఇయర్ ఇండస్ట్రీ' పృథ్వీ

Webdunia
సోమవారం, 27 జూన్ 2022 (08:51 IST)
వైకాపా అనే ఉగ్రవాద కేంద్రంలో ఇచ్చిన శిక్షణ ప్రభావంతోనే మెగాబ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్‌లతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అనరాని మాటలు అన్నాని వారు సహృదయంతో క్షమించాలని తెలుగు నటుడు, థర్టీ ఇయర్ ఇండస్ట్రీగా గుర్తింపు పొందిన పృథ్వీరాజ్ అన్నారు. పైగా, టీడీపీ చీఫ్ చంద్రబాబు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నానని, ఇందుకోసం ఆయన కాళ్లు పట్టుకుని దండం పెట్టేందుకు సైతం సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. 
 
ఆయన ఓ తెలుగు పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో అనేక అంశాలపై తన మనస్సులోని మాటలను కుండ బద్ధలుకొట్టినట్టు చెప్పేశారు. శ్రీవేంకటేశ్వర భక్తి ఛానెల్ (ఎస్వీబీసీ) ఛైర్మన్‌గా పని చేసిన సమయంలో తాను గొప్పవాడినన్న అహంతో పాటు గర్వం పెరిగిందన్నారు. దీంతో ఎవరినీ లెక్కచేయకుండా అనరాని మాటలు అన్నానని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. 
 
చిరంజీవి, పవన్ కళ్యాణ్, చంద్రబాబు వంటి వారిని అనరాని మాటలు అన్నానని, అయితే, వారు పెద్ద మనసుతో సీరియస్‌గా తీసుకోకపోగా సహృదయంతో అర్థం చేసుకున్నారన్నరు. తాను తప్పు చేశానని, మీ కాళ్లకు దండం పెడతానని చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబుకు చెప్పానని వెల్లడించారు. 
 
తమకు ఎవరితోనూ శత్రుత్వం లేదని, జరిగిందేదో జరిగిపోయింది.. సినిమాలు చేసుకుంటూ హ్యాపీగా ఉండాలని వారు తనకు సూచించారని చెప్పారు. అదేసమయంలో 2024లో ఓ మంచి బస్సు ఎక్కి సపోర్ట్ చేయనున్నట్టు తెలిపారు. ముఖ్యంగా, జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ఇదే విషయాన్ని పవన్‌కు చెప్పగా, తప్పకుండా పిలుస్తానని, ఇప్పటికి సినిమాలు చేసుకోవాలని సలహా ఇచ్చారన్నారు. 

సంబంధిత వార్తలు

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

మహానాడు వాయిదా.. ఎన్నికల ఫలితాల తర్వాత నిర్వహిస్తారా?

హిందూపురంలో తక్కువ శాతం ఓటింగ్ నమోదు ఎందుకని?

పవన్ కల్యాణ్ సెక్యూరిటీ గార్డు వెంకట్ ఇంటిపై దాడి

ముళ్లపందిని వేటాడబోయి మూతికి గాయంతో అల్లాడిన చిరుతపులి - video

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

తర్వాతి కథనం
Show comments