Webdunia - Bharat's app for daily news and videos

Install App

విడాకులకు సిద్ధమవుతున్న మరో టాలీవుడ్ సెలెబ్రిటీస్

Webdunia
ఆదివారం, 26 జూన్ 2022 (17:24 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ నేపథ్య గాయకులు హేమచంద్ర, శ్రావణ భార్గవి. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. గత 2013 ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల దినోత్సవం రోజున ఓ ఇంటివారయ్యారు. కొన్నేళ్ల దాంపత్య జీవితానికి ఓ పాప కూడా ఉంది. 
 
అయితే, ప్రస్తుతం ఈ జంట విడిపోనుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరి మధ్య కొన్ని మనస్పర్ధలు రావడంతో గత కొన్ని రోజులుగా విడివిడిగా ఉంటున్నారట. అయితే తాజాగా వీరిద్దరూ విడిపోయి విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నారట.
 
ప్రేమించి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్న వీళ్లిద్దరు విడిపోవడం ఏంటని అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. వీరిద్దరూ కలిసి అంతకుముందు పాటల పోటీల్లో పాల్గొన్నారు. ఆ సమయంలోనే వీరి మధ్య కాస్త పరిచయం ఏర్పడింది. 
 
పరిచయం ముదిరి ప్రేమగా మారింది. అది పెళ్లి వరకు దారి తీసింది.హేమచంద్ర ఆ తర్వాత ప్లే బ్యాక్ సింగర్‌గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. అలాగే డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా పని చేస్తున్నారు. శ్రావణ భార్గవి కూడా సింగర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
 
అయితే బుల్లితెర మీద వచ్చే చాలా షోలకి హాజరై ఈ కపుల్ సందడి చేస్తూ ఉంటుంది. టాలీవుడ్‌లో ఈ జంటను చూసిన వాళ్ళు అందరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ కాంప్లిమెంట్ ఇస్తూ ఉంటారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట ఒక్కసారిగా విడిపోతున్నారు అని వార్తలు బయటకు వచ్చేసరికి చాలామంది నమ్మలేకపోతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగ్నేయాసియా దేశాలను వణికించిన భూకంపం.. మయన్మార్‌లో 153కి చేరిన మృతులు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments