Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుష్మిత కొణిదెల నిర్మాత - సేనాప‌తిగా రాజేంద్ర‌ప్ర‌సాద్‌ ఓటీటీ ఎంట్రీ

Webdunia
ఆదివారం, 12 డిశెంబరు 2021 (18:11 IST)
Senapthi poster
మారుతున్న ట్రెండ్‌ను అనుస‌రిస్తూ ప్రపంచంలోని తెలుగు ప్రేక్ష‌కుల‌కు 100 ప‌ర్సెంట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందించ‌డ‌మే ల‌క్ష్యంగా ప్రారంభ‌మైన తెలుగు ఓటీటీ మాధ్య‌మం ఆహా. తిరుగులేని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను ఎల్ల‌ప్పుడూ అందిస్తామ‌ని ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకుంటూ ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు ప్రేక్ష‌కులకు సంతోషాన్ని అందిస్తూ అల‌రిస్తున్న తెలుగు ఓటీటీ మాధ్య‌మం ఆహాలో మ‌రో కొత్త వెబ్ సిరీస్ రానుంది. అదే.. సేనాప‌తి. ఈ రిడెంప్ష‌న్ డ్రామా ద్వారా టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు, న‌ట కిరిటీ రాజేంద్ర‌ప్ర‌సాద్ ఓటీటీ ఎంట్రీ ఇస్తుండ‌టం విశేషం. ప్రేమ ఇష్క్ కాద‌ల్ వంటి చిత్రాన్ని తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు ప‌వ‌న్ సాధినేని ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల, విష్ణు ప్ర‌సాద్ ఈ సిరీస్‌ను నిర్మించారు. న‌రేష్ అగ‌స్త్య, జ్ఞానేశ్వ‌ర్ కందేర్గుల‌, హ‌ర్ష‌వ‌ర్ద‌న్‌, రాకేందు మౌళి త‌దిత‌రులు ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. 
 
ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో భాగంగా ‘సేనాప‌తి’ సిరీస్ మోష‌న్ పోస్ట‌ర్‌ను మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఆదివారం( ఇవాళ) విడుద‌ల చేశారు. ఓ తాత‌య్య త‌న మ‌న‌వ‌డితో మాట్లాడుతున్న‌ట్లు మోష‌న్ పోస్ట‌ర్ ప్రారంభం అవుతుంది. అందులో ఓ రాజు..ఆయ‌న ఏడుగురు కొడుకులు చేపల వేట‌కి వెళతారు. దానికి  సంబంధించిన క‌థ‌ను రైతు చెప్ప‌డం మోష‌న్ పోస్ట‌ర్ ప్రారంభం అవుతుంది. రాజేంద్ర ప్ర‌సాద్ చెప్పే క‌థ‌నం ఓ ఇన్‌టెన్స్‌ను క్రియేట్ చేస్తుంది. జిగ్‌సా పజిల్ ఉండే అంశాల‌న్ని క‌లిసి ఓ వాస్త‌విక రూపానికి వ‌స్తాయి. అలాగే ఈ సిరీస్ కూడా ఉండ‌బోతుంద‌ని మోష‌న్ పోస్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు మేక‌ర్స్‌. ఇందులో రాజేంద్ర ప‌సాద్ ముఖంపై క‌న‌ప‌డుతున్న తుపాకీ ఎవ‌రిది.. ఎందుకు చూపిస్తున్నార‌నే ఆస‌క్తిని క‌లిగిస్తుంది. 
 
సాధార‌ణంగా రాజేంద్ర ప్ర‌సాద్ పేరు చెబితే ఆయ‌న మ‌నల్ని వివిధ పాత్ర‌ల‌తో ఎలా న‌వ్వించారో ఆ పాత్ర‌లే గుర్తుకు వ‌స్తాయి. సేనాప‌తి సిరీస్‌లో మూర్తి అనే సీరియ‌స్ పాత్ర‌లో రాజేంద్ర ప్ర‌సాద్ క‌నిపించ‌నున్నారు. ఆయ‌న‌తో పాటు బ‌ల‌మైన పాత్ర‌ల్లో మంచి ఆర్టిస్టులు స‌హ తారాగ‌ణం న‌టించారు. యూత్, అనుభ‌వం ఉన్న‌వారు కాంబినేష‌న్‌లో రూపొందిన సేనాప‌తి టైట్ స్క్రీన్ ప్లే, ప‌వ‌ర్ ప్యాక్డ్ నెరేష‌న్‌, షార్ప్ పెర్ఫామెన్‌సెస్‌, యూనిక్ ప్లాట్‌తో ఆడియెన్స్‌ను అల‌రించ‌డానికి సిద్ధంగా ఉంది. త్వ‌ర‌లోనే సేనాప‌తి ఆహాలో ప్రేక్ష‌కుల‌ను ముందుకు రానున్నాడో మేక‌ర్స్ తెలియ‌జేస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మేమేమైన కుందేళ్లమా? ముగ్గురు సంతానంపై రేణుకా చౌదర్ ఫైర్

నెలలో ఏడు రోజులు బయట తిండి తింటున్న హైదరాబాదీలు!

ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ ఎప్పటి నుంచో తెలుసా?

జగన్ కేసుల్లో కీలక పరిణామం : కింది కోర్టుల్లో పిటిషన్ల వివరాలు కోరిన సుప్రీం

బెయిలిచ్చిన మరుసటి రోజే మీరు మంత్రి అయ్యారు.. ఏం జరుగుతోంది? : సుప్రీంకోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments