Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుశాంత్ ఫాంహౌజ్‌లో ఆ ముగ్గురు హీరోయిన్లు... ఏం చేసేవారంటే...

Webdunia
బుధవారం, 16 సెప్టెంబరు 2020 (08:30 IST)
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు తర్వాత అతనిగురించి అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సుశాంత్‌ డ్రస్స్ తీసుకునేవాడనీ, పలువురు హీరోయిన్లతో సంబంధాలు ఉండేవని తెలుస్తోంది. ముఖ్యంగా, సుశాంత్ ఫాంహౌజ్‌లో తరచుగా హీరోయిన్లతో కలిసి పార్టీలు చేసుకునేవాడని తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఫాంహౌజ్‌కు ఎక్కువగా హీరోయిన్లు సారా అలీఖాన్, రియా చక్రవర్తి, శ్రద్ధా కపూర్‌లు వచ్చేవారని ఫాంహౌజ్ మేనేజరు రయీస్ తాజాగా వెల్లడించాడు. దీంతో సుశాంత్ ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
 
కాగా, జూన్ 14వ తేదీన సుశాంత్ తన ఫ్లాట్‌లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెల్సిందే. ఆ తర్వాత ఈ కేసును సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు చేపట్టింది. ఈ దర్యాప్తులో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా, సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తికి డ్రగ్స్ వ్యాపారులకు సంబంధాలు ఉన్నట్టు తేలింది. దీంతో రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్టు చేసింది. 
 
ఈ నేపథ్యంలో సుశాంత్ ఫాంహౌజ్ మేనేజర్ రయీస్ ఆసక్తికర వివరాలు తెలిపారు. లోనావాలా ఐలాండ్‌లో ఉన్న సుశాంత్ ఫాంహౌజ్ కు హీరోయిన్లు సారా అలీఖాన్, రియా చక్రవర్తి, శ్రద్ధా కపూర్ తరచుగా వచ్చేవారని, అంతా కలిసి పార్టీలు చేసుకునేవారని వెల్లడించారు. పార్టీ జరిగిన ప్రతిసారి స్మోకింగ్ పేపర్లకు ఆర్డర్ ఇచ్చేవారని, ఆ స్మోకింగ్ పేపర్లతో ఏంచేస్తారో తనకు తెలియదని రయీస్ వివరించాడు. కానీ పార్టీ వస్తువుల లిస్టులో మాత్రం స్మోకింగ్ పేపర్లు తప్పకుండా ఉండేవని చెప్పాడు.
 
లాక్డౌన్ ప్రకటించకముందు సుశాంత్ వారంలో ఒకటి రెండు సార్లు ఫాంహౌజ్‌కు వచ్చేవాడని తెలిపారు. మొదట్లో సుశాంత్ వెంబడి సారా అలీఖాన్ ఎక్కువగా కనిపించేదని, ఆ తర్వాత రియా కూడా ఫాంహౌజ్‌కు రావడం మొదలుపెట్టిందని వివరించారు.
 
అంతేకాదు, రియా తల్లిదండ్రులు, సోదరుడు షోవిక్ కూడా సుశాంత్ ఫాంహౌజ్‌లోనే బర్త్ డే, ఇతర వేడుకలు జరుపుకునేవారని పేర్కొన్నారు. లాక్డౌన్ సమయాన్ని సుశాంత్ ఫాంహజ్‌లోనే గడపాలని నిర్ణయించుకున్నా, ఆ తర్వాత తన ఆలోచన మార్చుకున్నాడని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం