బాలీవుడ్ ఇండస్ట్రీ చాలా క్రూరమైనది సుశాంత్... : సంజయ్ నిరుపమ్

Webdunia
మంగళవారం, 16 జూన్ 2020 (19:22 IST)
బాలీవుడ్ యువనటుడు, ధోనీ బయోపిక్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‍పుత్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. ముంబై, బాంద్రాలోని తన నివాసంలోనే ఆయన బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ మరణవార్త తెలియగానే బాలీవుడ్‌తో పాటు వివిధ ప్రాంతీయ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. 
 
అయితే, ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీపై చేసిన వ్యాఖ్యలు ఇపుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. "నిన్ను దారుణంగా హింసించిన వారి గురించి నాకు బాగా తెలుసు" అంటూ సుశాంత్‌ను ఉద్దేశించి డైరెక్టర్ శేఖర్ కపూర్ ఆవేదనాభరితంగా చేసిన ట్వీట్ చేశారు. 
 
ఇదే క్రమంలో పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఇండస్ట్రీలోని చీకటి కోణాలను బయటపెడుతున్నారు. సుశాంత్ మరణంపై రాజకీయ నాయకుడు సంజయ్ నిరుపమ్ కూడా సంచలన ఆరోపణలు చేశారు. 2019లో 'చిచోరే' సినిమా హిట్ అయిన తర్వాత సుశాంత్ సింగ్ ఆరు సినిమాలకు సైన్ చేశాడని... అయితే కావాలనే ఆ సినిమాల నుంచి సుశాంత్‌ను తప్పించేశారని చెప్పారు. 
 
దీనికి కారణం ఎవరని ప్రశ్నించారు. హిందీ సినీ పరిశ్రమలోని క్రూరత్వం మరో స్థాయికి చేరుకుందని... ప్రతిభ కలిగిన యువ నటుడిని బలిగొందని మండిపడ్డారు. ఇపుడు మాత్రం మొసలి కన్నీరు కారుస్తోందని ఆయన ఆరోపించారు. ఇలాంటి ఇండస్ట్రీ కారణంగా అనేక మంది యువ కళాకారాలు అర్థాంతరంగా తనువు చాలిస్తున్నారంటూ సంజయ్ నిరుపమ్ వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలు బస్సు ప్రమాదం, డ్రైవర్ బస్సు నడుపుతూ బిగ్ బాస్ చూస్తున్నాడా?

Bapatla, ఇంట్లో అమ్మానాన్నలు ఏమవుతారోనన్న స్పృహ వుంటే ఇలా బైక్ నడుపుతారా, గుద్దేశారు (video)

Kurnool Bus Accident: కర్నూలు ఘటన.. బస్సు ఓనర్ అరెస్ట్

రేవంత్ రెడ్డి ఓ బ్లాక్‌మెయిలర్.. జూబ్లీహిల్స్‌ ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేస్తే అంతే సంగతులు: హరీష్

Pawan Kalyan: అధికారుల పనితీరుపై ఏపీ డిప్యూటీ సీఎం తీవ్ర అసంతృప్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments