Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుశాంత్ కేసు.. రియా.. మహేష్ భట్ సంభాషణ లీక్.. మార్చురీకి ఆమె ఎందుకెళ్లింది?

Webdunia
శుక్రవారం, 21 ఆగస్టు 2020 (16:32 IST)
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసును సుప్రీం కోర్టు సీబీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మీడియా చేతికి దొరికిన ఓ వాట్సాప్ ఛాటింగ్ వివరాలు ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే సుశాంత్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి, ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత మహేశ్ భట్ మధ్య జూన్ 8న జరిగింది కావడం ఈ సంచలనానికి మరింత కారణమైంది.
 
ఈ మెసెజ్‌లలో రియా 'అయేషా మూవ్స్‌ ఆన్‌ సర్‌.. ఇప్పుడు చాలా ఉపశమనంగా' ఉంది అంటూ మహేష్‌ భట్‌కు మెసేజ్‌ చేసింది. అయేషా అనేది 'జలేబి' చిత్రంలో రియా చక్రవర్తి పోషించిన పాత్ర పేరు. దీనికి మహేష్‌ భట్‌ నిర్మాత. ఆ తర్వాత 'మీరు నాకు చేసిన చివరి కాల్‌ వేక్‌ అప్‌ కాల్‌ లాంటిది. మీరు నా ఏంజెల్‌.. ఇప్పుడు ఎప్పుడు' అని రియా మెసేజ్‌ చేస్తే.. అందుకు మహేష్‌ భట్‌.. 'ఇక వెనక్కి తిరిగి చూడకు.. అనివార్యమైన దాన్ని సాధ్యం చేయండి. మీ తండ్రికి నీ ప్రేమ.. అతను సంతోషంగా ఉంటాడు' అని రిప్లై ఇచ్చాడు. అందుకు రియా 'ఆ రోజు మీరు మా నాన్న గురించి ఫోన్‌లో చెప్పిన మాటలు నాకు ధైర్యాన్ని ఇచ్చాయి. నేను బలంగా ఉండటానికి కావాల్సిన ధైర్యాన్ని ఇచ్చాయి' అంటూ వారి సంభాషణ కొనసాగింది. ప్రస్తుతం సంభాషణ నెట్టింట వైరల్ అవుతోంది. 
 
అలాగే ఈ కేసులో జాతీయ మీడియా ఒక సంచలన విషయం బయటపెట్టింది. సుశాంత్ సింగ్ కేసుకి సంబంధించి ఓ మీడియా చేసిన ఒక రహస్య ఆపరేషన్‌లో భాగంగా... ముంబై కూపర్ ఆస్పత్రి మార్చురీ అధికారిని విచారించింది. రియా చక్రవర్తి... సుశాంత్ సింగ్ ఉన్న మార్చురీలోకి వెళ్ళింది అని కాని సుశాంత్ ఫ్యామిలీని మాత్రం అనుమతించలేదు అని పేర్కొన్నారు. దీని వెనుక బీ టౌన్ మాఫియానే కారణం అని జాతీయ మీడియా పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments