సుశాంత్‌ చాట్స్‌, ఈ-మెయిల్స్‌ డేటా కావాలి.. అడిగింది ఎవరు?

Webdunia
గురువారం, 11 నవంబరు 2021 (10:20 IST)
బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్ పుత్ కేసు నుంచి బాలీవుడ్ డ్రగ్స్ కేసుగా మారింది. చాలా మంది సెలబ్రిటీలను ఈ కేసులో విచారించారు. కొంతమందిని అరెస్ట్ చేసి విచారణ అనంతరం విడిచిపెట్టారు. సంవత్సరం పైగా కావొస్తున్నా ఈ కేసులో ఎలాంటి పురోగతి కనిపించలేదు. చాలా మంది ఈ కేసుని మర్చిపోయారు కూడా. సిబిఐ కూడా ఎన్ని విచారణలు చేసినా సుశాంత్ విషయంలో ఓ నిర్దారణకు రాలేదు.
 
మరోసారి సిబిఐ సుశాంత్ కేసులో విచారణ వేగవంతం చేయడానికి ట్రై చేస్తుంది. సుశాంత్ సింగ్‌ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన మరికొన్ని వివరాలు తెలిస్తే కేసులో మరిన్నికొత్త కోణాల్లో విచారణ చేయొచ్చు అని సిబిఐ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో సుశాంత్ కేసు విషయంలో సీబీఐ అమెరికాను ఆశ్రయించింది. 
 
సిబిఐ మ్యూచ్‌వల్‌ లీగల్‌ అసిస్టెన్స్‌ ట్రీటీ  కింద డిలీట్‌ అయిన సుశాంత్‌ చాట్స్‌, ఈ-మెయిల్స్‌ డేటా కావాలని గూగుల్‌, ఫేస్‌బుక్‌లను కోరింది. కాలిఫోర్నియాలోని గూగుల్‌, ఫేస్‌బుక్‌ ప్రధానకార్యాలయానికి వెళ్లి సీబీఐ సుశాంత్ సోషల్ మీడియా డేటా కావాలని కోరింది. సుశాంత్‌ సింగ్‌ కేసులో సీబీఐ ఎలాంటి నిర్ధారణకు రాకపోవడంతో డిలీటైన చాట్‌, ఈ మెయిల్స్ కోరినట్లు సుశాంత్‌ ఫ్యామిలీ లాయర్‌ వికాస్‌ సింగ్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కరూర్‌ బాధితులను కలిసిన టీవీకే చీఫ్ విజయ్ - దర్యాప్తు చేపట్టిన సీబీఐ

నత్తలా నడుచుకుంటూ వస్తున్న మొంథా తుఫాను, రేపు రాత్రికి కాకినాడకు...

పెరగనున్న ఏపీ జిల్లాల సంఖ్య.. ఆ రెండు జిల్లాల భాగాలను విలీనం చేస్తారా?

తుఫాను ప్రారంభమైంది... భూమిని సమీపించే కొద్దీ తీవ్రమవుతుంది.. ఏపీఎస్డీఎంఏ

ఇంటి ముందు పెరిగిన గడ్డిని తొలగిస్తున్న యువతిని కాటేసిన పాము.. మూడు ముక్కలైనా..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments