Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జగతి పబ్లికేషన్స్‌లోకి వచ్చింది పెట్టుబడులు కావు.. ముడుపులు.. సీబీఐ

జగతి పబ్లికేషన్స్‌లోకి వచ్చింది పెట్టుబడులు కావు.. ముడుపులు.. సీబీఐ
, మంగళవారం, 9 నవంబరు 2021 (11:28 IST)
ఏపీ సీఎం జగన్, ఎంపీ విజయసాయి రెడ్డిపై సీబీఐ ఫైర్ అయ్యింది. జగతి పబ్లికేషన్స్‌లోకి వచ్చింది పెట్టుబడులు కావని.. ముడుపులేనని సిబిఐ స్పష్టం చేసింది. దీనిపై బలమైన ఆధారాలు ఉన్నాయని తెలిపింది. తమపై కేసులను కొట్టివేయాలని హిటెరో కంపెనీ, ఆ సంస్థ ఎండి శ్రీనివాస్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లపై సోమవారం తెలంగాణ హైకోర్టులో జస్టిస్ షమీమ్ అక్తర్ ధర్మాసనం విచారణ చేపట్టింది. 
 
మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ సొంత మీడియా సంస్థ ‘జగతి పబ్లికేషన్’ లో ఒక్క పైసా పెట్టుబడి పెట్టకుండానే రూ.1246 కోట్ల ‘లబ్ది’ పొందారని సీబీఐ స్పష్టం చేసింది. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ముడుపులను పెట్టుబడుల రూపంలో స్వీకరించారని తెలిపింది. ‘క్విడ్ ప్రోకో’ నిజమని తేల్చిచెప్పింది.
 
ఈ కేసులో సీబీఐ తరఫు న్యాయవాది సురేందర్ వాదనలు వినిపించారు. ‘జగతి సంస్థలో జగన్ రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండానే ఇతరులతో రూ.1246 కోట్లు పెట్టుబడిగా పెట్టించారు. ఇందుకోసం తండ్రి అధికారాన్ని ఉపయోగించుకున్నారు. ఈ విషయంలో జగన్, విజయసాయిరెడ్డి ప్రణాళిక ప్రకారం కుట్రపూరితంగా వ్యవహరించారు.
 
తండ్రి అధికారాన్ని ద్వారానే హెటిరో, తదితర కంపెనీలకు లబ్ధి చేకూర్చి, వారిచ్చే ముడుపులనే.. జగన్ తన సంస్థల్లోకి పెట్టుబడులు మళ్ళించారు’ అని తెలిపారు.  ఈ విషయాన్ని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ  స్వయంగా ధ్రువీకరించిందని, హెటిరో హెల్త్ కేర్‌లో జరిపిన తనిఖీల్లో ఈ పెట్టుబడులకు సంబంధించిన వివరాలు బయటపడ్డాయని వెల్లడించారు. వైఎస్ సర్కారు భూములు కేటాయించడం.. ఆ భూములు పొందిన వారు జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం... అప్పట్లో జరిగిన క్విడ్ ప్రోకో ఇదేనని సీబీఐ ఇప్పటికే తేల్చింది.
 
అయితే పిటిషనర్లు భూకేటాయింపులు వేరు, పెట్టుబడులు వేరు అని భ్రమింపజేస్తున్నారని, రెండింటినీ కలిపి చూడాలని సీబీఐ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. అప్పుడే అసలైన కుట్ర బయటపడుతుందని వివరించారు. పెట్టుబడులకు సంబంధించి హెటిరో సంస్థ నిర్ణయాలకు, ఎండీ శ్రీనివాస్ రెడ్డికి సంబంధం లేదని వాదించడం సరికాదని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చందానగర్‌లో బాలుడు మిస్సింగ్...