Webdunia - Bharat's app for daily news and videos

Install App

రావణాసుర‌లో సుశాంత్ పోస్ట‌ర్

Webdunia
శుక్రవారం, 18 మార్చి 2022 (17:06 IST)
Sushanth
రవితేజ, క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మల ప్రత్యేకమైన యాక్షన్ థ్రిల్లర్ `రావణాసుర`. కీల‌క‌మైన భారీ షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. రవితేజతో పాటు కీలక పాత్రలో నటిస్తున్న సుశాంత్ కూడా షూటింగ్‌లో పాల్గొన్నారు.
 
ఈరోజు సుశాంత్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ టీమ్ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. సుశాంత్ నీలి రంగు క‌ళ్ళ‌తో, పొడవాటి జుట్టు,  గడ్డంతో తీక్ష‌ణంగా చూస్తున్నట్లు క‌నిపిస్తున్నాడు. దీనిని బ‌ట్టి ఆయ‌న పాత్ర వైవిధ్యంగా వుంటుంద‌ని అర్థ‌మ‌వుతోంది.
 
అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టి టీమ్‌వర్క్స్‌పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ మొత్తం ఐదుగురు కథానాయికలు నటిస్తున్న ఈ సినిమాలో రవితేజ లాయర్‌గా నటిస్తున్నాడు.
 
రచయితగా కొన్ని ప‌వ‌ర్‌ఫుల్ చిత్రాల‌కు ప‌నిచేసిన‌ శ్రీకాంత్ విస్సా ఈ సినిమా కోసం కొత్త తరహా కథను రాశారు.  ప్రముఖ నటులు, సాంకేతిక సిబ్బంది ఈ చిత్రానికి ప‌నిచేస్తున్నారు.
 
హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సంయుక్తంగా ఈ చిత్రానికి సంగీతం అందించగా, విజయ్ కార్తీక్ కన్నన్ ఛాయాగ్రహణం, శ్రీకాంత్ ఎడిటర్.
 
తారాగణం: రవితేజ, సుశాంత్, అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా (అఖండ ఫేమ్), సత్య, జయ ప్రకాష్ తదితరులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments