Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఔను.. కళ్యాణి నన్ను వదిలి వెళ్లింది.. ఈ జన్మకు నా భార్య కళ్యాణినే... (video)

ఔను.. కళ్యాణి నన్ను వదిలి వెళ్లింది.. ఈ జన్మకు నా భార్య కళ్యాణినే... (video)
Webdunia
శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (15:18 IST)
ఔను.. కళ్యాణి నన్ను వదిలి వెళ్లింది.. అయినప్పటికీ.. ఈ జన్మకు ఆమెనే నా భార్య అంటూ భావోద్వేగానికి గురయ్యాడు టాలీవుడ్ దర్శకుడు సూర్యకిరణ్. కళ్యాణి నాకు చాలా బాగా కనెక్ట్ అయిందనీ, కానీ నాతో కలిసి జీవించాలని కళ్యాణికి ఇష్టం లేదని చెప్పుకొచ్చాడు.
 
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హీరోయిన్లలో కళ్యాణి ఒకరు. 'ఔను వాళ్లిద్ద‌రు ఇష్ట‌ప‌డ్డారు', 'క‌బ‌డ్డీ క‌బ‌డ్డీ', 'వ‌సంతం', 'దొంగోడు' వంటి చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చాలా దగ్గరైన హీరోయిన్. మాస్ మహారాజ్ రవితేజకు సరైన జోడీగా గుర్తింపు పొందిన నటి. 
 
ఈమె స‌త్యం', 'ధ‌న 51', 'బ్ర‌హ్మాస్త్రం', 'రాజు భాయ్' వంటి చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సూర్య‌కిర‌ణ్‌ను పెళ్లి చేసుకుంది. కొంతకాలం కలిసివున్న తర్వాత వారిద్దరూ విడిపోయినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బిగ్ బాస్-4 సీజన్‌కు సూర్యకిరణ్ ఎంపికై తొలి వారంలోనే ఎలిమినేట్ అయ్యాడు. 
 
ఈ సందర్భంగా తన వైవాహిక సంబంధంపై సూర్యకిరణ్ స్పందిస్తూ, ఔను క‌ళ్యాణి న‌న్ను వ‌దిలివెళ్లింది నిజ‌మే. అది నా నిర్ణ‌యం కాదు. నాతో క‌లిసి జీవించాల‌ని క‌ళ్యాణికి ఇష్టం లేదని చెప్పాడు. నాతో స‌మ‌స్య‌లు లేకున్నా..నాతో క‌లిసి జీవించ‌క‌పోవ‌డానికి ఆమెకు కార‌ణాలున్నాయ‌ని సూర్య‌కిర‌ణ్ చెప్పుకొచ్చాడు. 
 
తాను బిగ్ బాస్‌కు వెళ్లడం ద్వారా క‌ళ్యాణిని మిస్స‌వ‌డం లేద‌ని, ప్ర‌తీ రోజు క‌ళ్యాణిని మిస్స‌వుతున్నాన‌ని భావోద్వేగానికి లోన‌య్యాడు. క‌ళ్యాణి నాకు చాలా బాగా క‌నెక్ట్ అయిపోయారు. ఈ జ‌న్మ‌కు నా భార్య క‌ళ్యాణియేన‌ని అన్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అత్తగారితో నేనుండనన్న కోడలు, తల్లీకొడుకుల ఆత్మహత్యతో కథ ముగిసింది

బోరుగడ్డపై ఏపీ హైకోర్టు సీరియస్... గడువులోగా లొంగిపోకుంటే...

నిరీక్షణ ముగిసింది.. న్యాయం జరిగింది : ప్రణయ్ భార్య అమృత

పాకిస్థాన్‌లో రైలు హైజాక్ ... బందీలుగా 400 మంది ప్రయాణికులు

Pakistan Train: పాకిస్థాన్ రైలు హైజాక్.. ఆరుగురు సైనికులు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామకాయ దొరికితే తినేయండి

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి

వేసవిలో సబ్జా వాటర్ ఆరోగ్య ప్రయోజనాలు

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

తర్వాతి కథనం
Show comments