Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూర‌ప్‌లో రెండు పాట‌లు పూర్తిచేసుకున్న "ఖైదీ నంబ‌ర్ 150''.. స్టెప్పులు అదుర్స్

మెగాస్టార్ చిరంజీవి, కాజ‌ల్ హీరోహీరోయిన్లుగా వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో `ఖైదీ నంబ‌ర్ 150` వ సినిమా ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. హైద‌రాబాద్‌లో ప‌లు కీల‌క స‌న్నివేశాల‌ను తెర‌క

Webdunia
సోమవారం, 21 నవంబరు 2016 (09:05 IST)
మెగాస్టార్ చిరంజీవి, కాజ‌ల్ హీరోహీరోయిన్లుగా వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో `ఖైదీ నంబ‌ర్ 150` వ సినిమా ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. హైద‌రాబాద్‌లో ప‌లు కీల‌క స‌న్నివేశాల‌ను తెర‌కెక్కించిన టీమ్ ఇటీవ‌లే పాట‌ల చిత్ర‌ీకరణ‌కు యూర‌ప్ వెళ్లింది. అక్క‌డ క్రొయేషియా, స్లోవేనియా వంటి ఎగ్జాటిక్ లొకేష‌న్ల‌లో చిత్రీక‌ర‌ణ చేశారు. తాజాగా టీమ్ ఆ ప‌నుల‌ను కూడా పూర్తి చేసుకుని హైద‌రాబాద్ తిరిగి వ‌చ్చేసింది.
 
ఆ రెండు పాట‌లు మెగాస్టార్ స్టైల్‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా ఉంటాయ‌ని యూనిట్ చెబుతోంది. యంగ్ కొరియోగ్ర‌ఫ‌ర్స్ శేఖ‌ర్, జానీ మాస్ట‌ర్ నేతృత్వంలో కంపోజ్ అయిన పాట‌ల్లో మెగాస్టార్  స్టెప్పులు ఫ్యాన్స్‌కు కిక్కెంచ‌డం షురూ అని మాస్టర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవితో కలిసి పనిచేసే  అరుదైన అవకాశాన్ని దక్కించుకున్న ఈ యువ టెక్నిషీయ‌న్స్ ఆనందంతో ఉబ్బిత‌బ్బితున్నారు. మెగాస్టార్ మూవీకు ప‌నిచేయ‌డంతో జీవితానికి ఓ అర్ధం వ‌చ్చింద‌ని జానీ మాష్ట‌ర్ ఆనందం వ్య‌క్తం చేశారు.
 
ఇక త‌దుప‌రి మిగిలిన షూటింగ్ పార్టుపై టీమ్ బిజీ కానుంది. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై మెగాపవర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్న సంగ‌తి తెలిసిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Big Boss in AP Liquor Scam: ఏపీ మద్యం కుంభకోణం-బిగ్ బాస్ జగన్‌ను జైలుకు పంపాలి సోమిరెడ్డి కామెంట్స్

Leopard : తిరుమలలో చిరుతపులి కదలికలు- భయాందోళనలో భక్తులు- టీటీడీ అలెర్ట్

KTR: తెలంగాణలో రాహుల్ గాంధీ ఈ ప్రాంతాల్లో పర్యటించాలి.. కేటీఆర్ డిమాండ్

Telangana: మావోయిస్టులతో చర్చలు జరపండి.. హింస వద్దు.. లెఫ్ట్ పార్టీలు

Rahul Gandhi: ఇతరులు ఏమి చెబుతున్నారో వినడం నేర్చుకున్నాను.. రాహుల్ గాంధీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments