Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాటాకు చప్పుళ్లకు మోడీ భయపడరు.. చావో రేవో తేల్చుకుంటారు: నాగబాబు ప్రశంస (వీడియో)

ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మెగా ఫ్యామిలీ హీరో నాగబాబు ఆకాశానికెత్తేశారు. అవినీతి నిర్మూలనా చర్యల్లో భాగంగా దేశంలో పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్లను ప్రధాని రద్దు చేయడాన్ని ఆయన స్వాగతించారు. మంచి పని

Webdunia
సోమవారం, 21 నవంబరు 2016 (08:41 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మెగా ఫ్యామిలీ హీరో నాగబాబు ఆకాశానికెత్తేశారు. అవినీతి నిర్మూలనా చర్యల్లో భాగంగా దేశంలో పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్లను ప్రధాని రద్దు చేయడాన్ని ఆయన స్వాగతించారు. మంచి పని ఎవరు చేసినా అభినందించడాన్ని ప్రతి ఒక్కరు నేర్చుకోవాలని అన్నారు. 
 
స్వతహాగా కాంగ్రెస్ పార్టీ సభ్యుడైన నాగబాబు ఈ అంశంపై మాట్లాడుతూ ఏ నాయకుడు తీసుకోలేని సాహసోపేతమైన నిర్ణయాన్ని మోడీ తీసుకున్నారని, ఆయన నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ ప్రశంసించాలని కోరారు. నోట్ల రద్దుపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు కొట్టిపడేశారు. అవన్నీ అర్థంపర్థం లేని మాటలన్నారు. తాటాకు చప్పుళ్లకు మోడీ భయపడరని, చావో రేవో తేల్చుకుంటారని అన్నారు. 
 
70 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఓ మంచి నిర్ణయాన్ని తీసుకునే దమ్ము ఏ నాయకుడికీ లేకుండా పోయిందంటూ ఘాటైన విమర్శలు చేశారు. మెజారిటీ ఉన్నా మంచి నిర్ణయాన్ని తీసుకోలేని ప్రధానులు దేశంలో ఉన్నారన్నారు. తామరపువ్వు బురద లోంచే పుడుతుందని, ఇలాటి కుళ్లిన సమాజంలోంచి గొప్ప వ్యక్తి పుడతాడని మోడీని ఉద్దేశించి అన్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే పాలించేందుకు ఓ నియంత రావాలని, ఓ డిక్టేటర్ కావాలని అభిప్రాయపడ్డారు. 
 
తాను కాంగ్రెస్ సభ్యుడిని కాబట్టి అర్జెంటుగా మోడీని విమర్శించేయాలన్న అభిప్రాయం తనకు లేదని కుండబద్దలుగొట్టారు. నిజానికి బీజేపీ విధానాలపై తనకు కొంత వ్యతిరేకత కూడా ఉందన్నారు. చిరంజీవి కాంగ్రెస్‌లో చేరడంతో తామంతా కాంగ్రెస్ సభ్యులమయ్యామన్నారు. మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ నుంచి మన్మోహన్‌సింగ్ వరకు అందరి గురించీ మాట్లాడారు. 

 

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments