Webdunia - Bharat's app for daily news and videos

Install App

అభిమానుల బ్యాంకు ఖాతాల్లో రూ.5 వేలు జమ.. సాయం చేసిన హీరో ఎవరు?

Webdunia
గురువారం, 10 జూన్ 2021 (14:37 IST)
కరోనా కష్టకాలంలో ప్రతి ఒక్కరూ కష్టపడుతున్నారు. ధనవంతులు, కోటీశ్వరులు మినహా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఏదో రకంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పలువురు హీరోల అభిమానులు కూడా ఉన్నారు. అలాంటి అభిమానులను ఆదుకునేందుకు తమిళ హీరో సూర్య ముందుకు వచ్చారు. 
 
నిజానికి సూర్య సేవా కార్య‌క్ర‌మాల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌నక్క‌ర్లేదు. క‌ష్ట‌కాలంలో త‌న వంతు సాయం అందిస్తూ ఉండే సూర్య సెకండ్ వేవ్ అధికంగా ఉండ‌టంతో త‌మిళ‌నాడు ప్ర‌భుత్వ‌ నిధికి కోటి రూపాయ‌లు విరాళంగా ఇచ్చాడు. 
 
ఇక తాజాగా తన ఫ్యాన్‌ క్లబ్‌కు చెందిన 250 కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5000 చోప్పున మొత్తం రూ.12.5లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. ఆ డ‌బ్బుని నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జ‌మ చేశారు.
 
క‌రోనా వ‌ల్ల సూర్య అభిమానులు చాలా క‌ష్టాలు ప‌డుతున్నారు. వారి ప‌రిస్థితుల‌ని చూసి చ‌లించిన సూర్య ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. సూర్య త‌న అభిమానుల ప‌ట్ల చూపించిన ప్రేమ‌కు నెటిజ‌న్స్ ఫిదా అవుతున్నారు. 
 
గ‌త ఏడాది ఆకాశ‌మే నీ హ‌ద్దురా సినిమాతో భారీ హిట్ కొట్టిన సూర్య ప్రస్తుతం పాండిరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రియాంకా అరుళ్‌ మోహనన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. వెట్రిమారన్‌ దర్శకత్వంలో ‘వాడీవాసల్‌’, టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలోను సినిమాలు చేయ‌నున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మిథున్ రెడ్డికి షాకిచ్చిన సుప్రీంకోర్టు... సరెండర్‌కు కూడా నో టైమ్..

Hyderabad: పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశాడు..

Hyderabad: స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25- ఆరవ పరిశుభ్రమైన నగరంగా హైదరాబాద్

ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో లాలూకు చిక్కులు.. కేసు విచారణ వేగవంతం చేయాలంటూ...

భార్యాపిల్లలను బావిలో తోసేశాడు... ఆపై గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments