Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణాకు ఐదు బైపాప్‌ వెంటిలేటర్‌ యంత్రాలను విరాళంగా అందించిన ట్రాన్సాసియా

Advertiesment
TransAsia
, ఆదివారం, 23 మే 2021 (17:30 IST)
భారతదేశంలో సుప్రసిద్ధ ఐవీడీ ప్లేయర్‌ ట్రాన్సాసియా బయో మెడికల్స్‌ లిమిటెడ్‌ భారతదేశ వ్యాప్తంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు వేగవంతంగా కోవిడ్‌ 19 రోగులను గుర్తించి, చికిత్సను అందించేందుకు తోడ్పడుతుంది. కోవిడ్‌ 19 సెకండ్‌ వేవ్‌తో పోరాడుతున్న తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతునందించేందుకు ట్రాన్సాసియా 5 బైపాప్‌ వెంటిలేటర్‌ మెషీన్లను విరాళంగా అందజేసింది. వీటిని కోవిడ్‌ చికిత్సకు కట్టుబడిన ప్రభుత్వ ఆస్పత్రులకు అందించనున్నారు.
 
ఈ మెషీన్ల లభ్యత ప్రస్తుతం తక్కువగా ఉండటంతో ట్రాన్సాసియా ఈ మెషీన్లను తమ అంతర్జాతీయ వెండార్ల నుంచి సమకూర్చుకుంది.  తెలంగాణా రాష్ట్ర వైద్య సేవలు మరియు మౌలిక వసతుల అభివృద్ధి సంస్ధ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) జనరల్‌ మేనేజర్‌ (డయాగ్నోస్టిక్స్‌) డాక్టర్‌ వీ రాంబాబు నాయక్‌ ఈ యంత్రాలను టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీ చంద్రశేఖర్‌ రెడ్డి మార్గనిర్ధేశకాలకనుగుణంగా ట్రాన్సాసియా బయో మెడికల్స్‌ లిమిటెడ్‌ జోనల్‌ మేనేజర్‌ ఎన్‌ఎస్‌ మురళీధర్‌ నుంచి అందుకున్నారు.
 
ట్రాన్సాసియా మరియు వజీరానీ  ఫౌండేషన్‌లకు ధన్యవాదములు తెలిపిన డాక్టర్‌ వీ రాంబాబు నాయక్‌ మాట్లాడుతూ కరోనా వైరస్‌తో జరుగుతున్న పోరాటంలో సమయానికి అవసరమైన సహాయం వీరందించారన్నారు. ఈ వైరస్‌తో పోరాడుతున్న వేళ శ్వాస తీసుకోవడానికి కష్టపడుతున్న ఎంతోమంది కోవిడ్‌ 19 రోగులకు ప్రయోజనం కలిగిస్తూ నాన్‌ ఇన్వాసివ్‌ వెంటిలేషన్‌ను అందించేందుకు ట్రాన్సాసియా ప్రయత్నిస్తోంది. తెలంగాణాలో ఈ మహమ్మారిని నివారించడం, కనుగొనడం దానికనుగుణంగా స్పందించడంలో ట్రాన్సాసియా ప్రయత్నాలను అభినందిస్తున్నామన్నారు.
 
ట్రాన్సాసియా-ఎర్బా గ్రూప్‌ ఫౌండర్‌ అండ్‌ ఛైర్మన్‌ సురేష్‌ వజిరానీ మాట్లాడుతూ, ‘‘ఈ సెకండ్‌ వేవ్‌ మన దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. భారతదేశానికి అనుకూలంగా పరిస్థితులు త్వరలోనే మారగలవని ఆశిస్తున్నాము. అలాగని ఆశ ఒక్కటే సరిపోదని కూడా భావిస్తున్నాం. భారతీయుల ఆరోగ్యానికి ట్రాన్సాసియా కట్టుబడి ఉంది. ఈ చిరు కార్యక్రమం ద్వారా తీవ్రంగా ప్రభావితమైన రోగుల అవసరాలను తీర్చాలనుకుంటున్నాం. వజిరానీ ఫౌండేషన్‌ ద్వారా తాము చేపట్టిన పలు కార్యక్రమాలలో ఇది ఒకటి. మా వనరులు, సాంకేతికతలను వినియోగించుకుని కేంద్ర, రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖలకు తోడ్పడాలనుకుంటున్నాం’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆక్సిజన్ అందక చనిపోతే అవి ప్రభుత్వ హత్యలే...