Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా నుంచి కోలుకున్న హీరో సూర్య

Webdunia
శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (12:38 IST)
ఇటీవల కరోనా వైరస్ బారినపడి తమిళ హీరో సూర్య.. ఆ వైరస్ బారినుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నట్టు ఆయన సోదరుడు, హీరో కార్తి తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. 
 
ప్రస్తుతం అన్న సూర్య హోం క్వారంటైన్‌లోనే మరికొన్ని రోజులు ఉంటారన్నారు. అలాగే, తామంతా క్షేమంగా ఉన్నట్టు చెప్పారు. మీ అందరి ఆశీస్సులు, ప్రార్థనలకు థ్యాంక్స్ చెప్పడం చిన్న మాట అని కార్తీ తన ట్విట్టర్లో ట్వీట్ చేశారు.  
 
కాగా, వారం రోజుల క్రితం సూర్యకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిన విషయం తెల్సిందే. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఆ తర్వాత ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. బయట పరిస్థితులు ఇంకా చక్కబడలేదని, అందువల్ల ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలతో ఉండాలంటూ సూచించారు.
 
మరోవైపు, "ఆకాశం నీ హద్దురా" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూర్య సూపర్ హిట్ సాధించారు. ఈ సినిమాతో కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలోని విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్నారు. కరోనా వలన ఓటీటీలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సూర్య ప్రస్తుతం పాండిరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా, వెట్రిమారన్, సూరుతై శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో బిజీగా ఉన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఐసీయూలో పాకిస్థాన్ ఎయిర్‌బేస్‌లు : ప్రధాని నరేంద్ర మోడీ

Kavitha: ఆగస్టు 4 నుండి 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తా: కల్వకుంట్ల కవిత

అమెరికాలో భారత సంతతి కోపైలెట్‌ చేతులకు బేడీలు వేసి తీసుకెళ్లారు.. ఎందుకో తెలుసా?

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టారనీ పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు.. (వీడియో)

ఆగస్టు 10-12 తేదీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments