Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మంత్రి పెద్దిరెడ్డిని ఫిబ్రవరి 21 వరకూ ఇంటి నుంచి కదలనివ్వద్దు: ఎస్ఈసి నిమ్మగడ్డ ఆదేశం

మంత్రి పెద్దిరెడ్డిని ఫిబ్రవరి 21 వరకూ ఇంటి నుంచి కదలనివ్వద్దు: ఎస్ఈసి నిమ్మగడ్డ ఆదేశం
, శనివారం, 6 ఫిబ్రవరి 2021 (13:43 IST)
ఏపీ పంచాయతీరాజ్ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వున్నాయనీ, ఆయనను ఈ నెల 21 వరకూ ఇంటి నుంచి బయటకు రానివ్వద్దని ఏపీ డిజిపికి ఆదేశాలు జారీ చేసింది.
 
ఈ సమయంలో ఆయనను మీడియాతో కూడా మాట్లాడనివ్వరాదని సూచన చేసింది. పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిపేందుకు ఈ చర్య తప్పడంలేదని సీఈసి స్పష్టం చేసింది. కాగా మంత్రి పెద్దిరెడ్డి శుక్రవారం నాడు కొన్ని వ్యాఖ్యలు చేసారు.
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలకు మేరకు నడుచుకునే అధికారులపై చర్యలు తప్పవని వైకాపా ప్రభుత్వ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణలో పంచాయతీ రాజ్ శాఖ అధికారులు ఎస్ఈసీ చెప్పినట్టు నడుచుకుంటున్నారు. ఇది మంత్రి పెద్దిరెడ్డికి ఏమాత్రం రుచిచడం లేదు. అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తిని పెద్దిరెడ్డి వ్యక్తం చేశారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, జిల్లా అధికారులు ఎన్నికల నిబంధనలను తప్పక పాటించాలని స్పష్టం చేశారు. అధికారులు ఏకగ్రీవాలకు వెంటనే డిక్లరేషన్లు ఇవ్వాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా, చిత్తూరు, గుంటూరు జిల్లాల అధికారులు ఏకగ్రీవాలను వెంటనే ప్రకటించాలని తెలిపారు. జిల్లా అధికారులను ఎస్ఈసీ భయపెడుతున్నారని ఆరోపించారు. నిమ్మగడ్డ తన పరిధి దాటి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 
 
జిల్లా అధికారులు ఎస్ఈసీ మాటలు విని ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. తాము అధికారంలో ఉన్నంతకాలం అలాంటి అధికారులను బ్లాక్ లిస్టులో పెడతామని అన్నారు. ఈ వ్యాఖ్యల నేపధ్యంలో సీఈసి మంత్రి పెద్దిరెడ్డిపై ఈ చర్యలకు ఆదేశించింది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భళా! ఏమి డ్రామాలు నిమ్మగడ్డా, నారా బాబు: విజయసాయి రెడ్డి