Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ‌స్త్రచికిత్స స‌క్సెస్‌- ది డెవిల్ ఈజ్ బేక్ అంటూన్న ప్ర‌కాష్‌రాజ్‌

Webdunia
గురువారం, 12 ఆగస్టు 2021 (13:46 IST)
Prakash Raj on bed
తెగేదాక‌ లాక్కండి.. అంటూ ఇటీవ‌లే ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసిన ప్ర‌కాష్‌రాజ్‌, ఇప్పుడు ది డెవిల్ ఈజ్ బేక్ అంటూ త‌న గురించి పోస్ట్ చేశాడు. ఇటీవ‌లే ఓ షూటింగ్ నిమిత్తం యాక్ష‌న్ స‌న్నివేశాల్లో గాయాల‌య్యాయి. అయితే పెద్ద‌గా గాయ‌మేమీ అవ్వ‌లేద‌నీ, చిన్న‌పాటి దెబ్బ అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. త‌న‌కు బాగా న‌మ్మ‌క‌మున్న డా. గుర‌వారెడ్డిగారి ట్రీట్‌మెంట్ కోసం హైద‌రాబాద్ వ‌స్తున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. అనుకున్న‌ట్లు ఆయ‌న హైద‌రాబాద్‌లోని డా. గుర‌వారెడ్డి ఆసుప‌త్రిలో చేరారు.
 
గురవారెడ్డిగా పేరు పొందిన డాక్టర్ అన్నపరెడ్డి వెంకట గురవారెడ్డి ప్రముఖ వైద్యుడు, రచయిత. ఆయన కీళ్ళవ్యాధులకు చికిత్స చేయడంలో సిద్ధహస్తుడు.హైదరాబాదులోని సన్ షైన్ ఆసుపత్రుల మేనేజింగ్ డైరెక్టరు. గురువారంనాడు ప్ర‌కాష్‌రాజ్ ఆసుప‌త్రిలో వున్న ఫొటోను పోస్ట్ చేశాడు. ప్ర‌కాష్‌రాజ్ పోస్ట్ చేసిన ఫొటోలో ఆయ‌న ఎడ‌మ‌ భుజానికి శ‌స్త్రచికిత్స చేసిన‌ట్లు తెలుస్తోంది. భుజానికి శ‌స్త్రచికిత్స జ‌రిగిన‌ట్లు క‌నిపిస్తోంది. ఎడ‌మ‌చేతికి పూర్తిగా క‌ట్టుతో వుంది. ఈ సంద‌ర్భంగా ప్ర‌కాష్‌రెడ్డి మాట్లాడుతూ,  ప్రియమైన స్నేహితుడు డాక్టర్ గురువారెడ్డికి ధన్యవాదాలు. మీ ప్రేమ మరియు ప్రార్ధనలకి ధన్యవాదాలు. త్వరలో తిరిగి విధుల్లో పాల్గొంటాన‌ని తెలిపారు. కాగా, ఆయ‌న అధ్య‌క్షునిగా పోటీచేస్తున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు ఎప్పుడు జ‌ర‌గాల‌నేది ఈనెల 22న నిర్ణ‌యిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మంగళగిరిలో లేడీ అగోరి హల్చల్‌- పవన్ కళ్యాణ్‌ను కలిసేందుకు రోడ్డుపైనే..? (Video)

టీ అడిగితే లేదంటావా.. బేకరీలో మందుబాబుల ఓవరాక్షన్.. పిచ్చకొట్టుడు.. (video)

పెళ్లి కుమారుడు కోసం రైలును ఆపేశారు... రైల్వే మంత్రి థ్యాంక్స్ చెప్పిన వరుడి ఫ్యామిలీ

ప్రధాని నరేంద్ర మోడీకి నైజీరియా అత్యున్నత పురస్కారం

రౌడీ షీటర్ బోరుగడ్డకు ఠాణాలో వీఐపీ ట్రీట్మెంట్ - భయ్యా టీ అంటూ ఆర్డర్ వేయగానే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

తర్వాతి కథనం
Show comments