Webdunia - Bharat's app for daily news and videos

Install App

రుహాణి శర్మ HER చిత్రాన్ని విడుదల చేయబోతున్న సురేష్ ప్రొడక్షన్స్

Webdunia
మంగళవారం, 20 జూన్ 2023 (16:53 IST)
Ruhani Sharma HER
చిలసౌ మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి యూత్ ఆడియన్స్ మనసు దోచుకుంది రుహాణి శర్మ. రీసెంట్ గా HIT సినిమాతో అందం, అందుకు తగ్గ అభియనం ఉన్న టాలెంటెడ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత కెరీర్ పరంగా వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు HER అనే డిఫరెంట్ కాన్సెప్ట్ లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 
 
పోలీస్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు శ్రీధర్ స్వరగావ్ దర్శకత్వం వహించారు. డబుల్ అప్ మీడియాస్ సంస్థ ఫస్ట్ ప్రొడక్షన్ గా ఈ సినిమాను రఘు సంకురాత్రి, దీపా సంకురాత్రి నిర్మించారు. ఈ చిత్రంలో వికాస్ వశిష్ట, ప్రదీప్ రుద్ర, జీవన్ కుమార్, అభిగ్న్య, సంజయ్ స్వరూప్, బెనర్జీ, రవివర్మ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది.
 
ఈ నేపథ్యంలో HER ఫైనల్ కాపీ చుసిన సురేష్ ప్రొడక్షన్స్ వారు.. తమ సంస్థ  ద్వారా ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడానికి ముందుకొచ్చారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాకి టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ అయిన సురేష్ ప్రొడక్షన్స్ సపోర్ట్ లభించడం తమ విజయానికి తొలి మెట్టు అని చెబుతున్నారు దర్శకనిర్మాతలు.
 
ఇప్పటికే ఈ సినిమా ఆడియో హక్కులను ప్రముఖ ఆడియో సంస్థ సరిగమ సొంతం చేసుకుంది. గతంలో విడుదల చేసిన HER పోస్టర్స్, టీజర్ సినిమాపై హైప్ పెంచేశాయి. ఈ చిత్రంలో రుహాణి శర్మ ఓ చాలెంజింగ్ రోల్ చేసిందని ఇప్పటివరకు వచ్చిన అప్ డేట్స్ కన్ఫర్మ్ చేశాయి. ఈ చిత్రానికి విష్ణు బేసి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. చాణక్య తూరుపు ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. పవన్ బాణీలు కడుతున్నారు. అతి త్వరలో ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించనున్నారు మేకర్స్.  
 
తారాగణం: రుహాని శర్మ, వికాస్ వశిష్ట, ప్రదీప్ రుద్ర, జీవన్ కుమార్, అభిగ్న్య, సంజయ్ స్వరూప్, బెనర్జీ, రవివర్మ, రవి ప్రకాష్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాంగోపాల్ వర్మపై 9 కేసులు.. అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి..

చపాతీ రోల్ గొంతులో ఇరుక్కొని విద్యార్థి మృతి

నోరూరించే హైదరాబాద్ బిర్యానీ.. నాణ్యత జారిపోతోంది..

సరోగసీ కోసం హైదరాబాదుకు.. లైంగిక వేధింపులు.. మహిళ ఆత్మహత్య

"ఈగల్" బృందం ఏర్పాటు.. గంజాయి విక్రయిస్తే అంతే సంగతులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments