Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండస్ట్రీలో మోనోపొలికి సురేష్‌బాబు దూరమట!

Webdunia
శనివారం, 10 డిశెంబరు 2022 (15:24 IST)
Dil raju, suresh babu
తెలుగు సినిమారంగంలో ఈమధ్య కొందరు మోనోపొలీగా మారి తమకు ఇష్టంవచ్చినట్లు సినిమా టిక్కెట్‌ రేట్ల గురించి సి.ఎం.లను కలవడం, రేట్లు పెంచేయడంతోపాటు తమ స్వంత సినిమా విడుదలకు ఎక్కువ థియేటర్లు వచ్చేలా చూసుకోవడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా దిల్‌రాజు పేరు వినిపిస్తోంది. ఆమధ్య తెలుగు సినిమారంగంలో బడ్జెట్‌ పెరిగిపోతుందనీ, సినీ కార్మికులు వేతనాలు పెంచమంటే ఏకంగా షూటింగ్‌లు బంద్‌ చేసి కార్మికులకు ఇబ్బంది పెట్టారు. ఈ విషయంలో మొదటినుంచి దూరంగా వుంటున్న డి. సురేష్‌బాబు ఆ తర్వాత జరిగిన పరిణామాలవల్ల కూడా దూరంగా వున్నారు. ఎందుకని దూరంగా వున్నారు? పెద్ద నిర్మాణసంస్థ అయిన మీరు ఇలా చేయడం ఎంతవరకు భావ్యం? అనే ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.
 
ఇటీవల ఓ వ్యక్తి పేరు బాగా వినిపిస్తోన్న విషయం మీకు తెలిసిందే. తన సినిమా రిలీజ్‌కు రకరకాల కారణాలు చూపుతూ ఇష్యూను డైవర్ట్‌ చేస్తున్నాడు. సురేష్‌బాబు ఎందుకు దూరంగా వున్నారంటే ఇక్కడ ప్రతి నిర్మాణ సంస్థకు కొన్ని రూల్స్‌ వున్నాయి. డిస్నీ, నెట్‌ఫ్లిక్స్‌, ఆహా.. ఇలా కొన్ని సంస్థలకు ఎలాగైనా రూల్స్‌ పెట్టుకున్నారో వారు అలా పెట్టుకున్నారు. కానీ అవి అందరి  ప్రయోజనాల కోసం చూసుకోవాలి. ఇది వ్యాపార రంగం కనుక ఎవరి అనుకూలంగా వారు రూల్స్‌ పెట్టుకుంటారు. ఒక్కోసారి మారుస్తుంటారు. దీనిపై ఛాంబర్‌కానీ, నిర్మాతమండలికికానీ చాలా వరకు రైట్స్‌ లేవు. గతంలో కొందరు ఈ విషయపై పోరాటం చేశారు. కానీ మరలా ఎక్కడి గొంగలి అక్కడే వుంది. 
 
సినిమారంగంలో డిమాండ్‌ అండ్‌ సప్లయి. కాంతార సినిమా చిన్న సినిమా. కన్నడలో మారుమూల ప్రాంత కథ. అక్కడ బాగా ఆడిరది. తెలుగులో ట్రై చేద్దాం అని వేశారు. ఇరగబడి చూశారు. అలా అని ఇక్కడ సినిమాలు తక్కువకాదు. కానీ ఆ సినిమాకోసం ఎక్కువ థియేటర్లు ఇవ్వాల్సి వచ్చింది అంటూ తన శైలిలో చెప్పుకొచ్చారు. ఏదిఏమైనా నా సంస్థ నిర్మించే సినిమాలుకానీ, నా హీరోల నటించే సినిమాలు కానీ దేశంలో అన్నిచోట్ల షూటింగ్‌లు జరుపుకుంటున్నాయి. నలుగురికి పని కల్పిస్తుంది అని చెప్పారు. ఇక మోనోపొలీ పరిది ఎప్పటికైనా కొంతకాలమే అంటూ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడికి వచ్చిన యువతిపై సామూహిక అఘాయిత్యం.. ఎక్కడ?

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments