Webdunia - Bharat's app for daily news and videos

Install App

18 ఏళ్లకే పెళ్లి.. 20 ఏళ్లకే తల్లినయ్యాను.. 38 ఏళ్ళకే భర్తను కోల్పోయా: సురేఖా వాణి

Webdunia
గురువారం, 13 మే 2021 (18:01 IST)
క్యారెక్టర్ ఆర్టిస్ట్, సినీ నటి సురేఖా వాణి.. ఆలీతో సరదాగా షోలో పాల్గొంది. తను బుల్లితెర లోకి వచ్చి 22 సంవత్సరాలు అయిందని తెలిపింది. తాను 14 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు సిటీ కేబుల్‌లో యాంకర్‌గా చేసిందట. తన తండ్రి స్నేహితులకు సిటీ కేబుల్ ఉండేదని అందులో తన బాబాయ్ కూడా పని చేసే వాడని తెలిపింది. 
 
అప్పుడప్పుడు తను కూడా అక్కడికి వెళ్లడంతో తనతో కూడా సరదాగా ప్రోగ్రామ్ చేయించారట. ఇక అలా తను యాంకరింగ్ నుండి ఇక్కడ వారికి వచ్చానని తెలిపింది. ఇక టీవీలో అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా ఉందని తెలిపింది.
 
ఇక తనకు సోషల్ మీడియా ద్వారా వివాదాలు అవ్వవు కానీ చేస్తారు అని తెలిపింది. కొన్ని ఇష్యూస్ క్రియేట్ చేస్తుంటారు కానీ అవి నెగటివ్ గా కాదంటూ కేవలం వైరల్ చేస్తారని తెలిపింది. ఇక తను 38 ఏళ్ళకే తన భర్తను కోల్పోగా.. ఇటీవలే 40 వ పుట్టినరోజు జరుపుకుంది. 
 
ఇక గతంలో తను మరో పెళ్లి చేసుకోనున్నట్లు పుకార్లు రాగా.. తను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరో చూపించండి అంటూ.. అంతేకాకుండా డబ్బు ఉన్న వ్యక్తిని చూపించమని కోరింది. మనసుతో పనేముంది అంటూ.. మనసుతో పనులు జరగవని తోసిపుచ్చింది.
 
ఇక తను 18 ఏళ్లకే పెళ్లి చేసుకొని ఇరవై ఏళ్లకే ఓ బిడ్డకు తల్లి అయ్యానని తెలిపింది. ఇక తన భర్త గురించి ఆలీ కొన్ని విషయాలు అడుగగా భావోద్వేగానికి గురైంది. తన కూతురు ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తుందని.. సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయని తెలుపగా.. ఈ విషయం గురించి ఏం చేయాలో తనకు అర్థం కావడం లేదని అంటుంది. 
 
అంతేకాకుండా తను తన భర్తను సిటీ కేబుల్‌లోనే కలిసిందట. అక్కడి నుండి వాళ్ళ ప్రేమ పెళ్లి గా మారిందని తెలిపింది. ఇక ఇటీవల ఆమె విజయ్ నటించిన మాస్టర్ సినిమాలో నటించగా తనను ఎడిటింగ్ లో తొలగించారని తెలిపింది. కానీ ఓటీటీ లో యాడ్ చేశారని.. తాను నటించిన సన్నివేశాలు బాగున్నాయని.. సినిమా చూసిన వాళ్ళు చెప్పారని తెలిపింది.

సంబంధిత వార్తలు

బాబును కొనియాడిన స్వామి స్వరూపానంద.. స్వామీజీనా లేక ఊసరవెల్లినా?

జూన్ 12న చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. కొత్త కాన్వాయ్ సిద్ధం

చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవం- 13న స్కూళ్లు రీ-ఓపెన్

జగన్మోహన్ రెడ్డికి ట్రిపుల్ తలాక్ చెప్పేసిన విశాఖ పట్నం ప్రజలు..

నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి బ్యాడ్ లక్.. ఓటమికి కారణం అదేనా?

బ్రెయిన్ ట్యూమర్ సర్వైవర్స్‌తో అవగాహన వాకథాన్‌ని నిర్వహించిన కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలిపే 9 కారణాలు

మజ్జిగ ఇలాంటివారు తాగకూడదు, ఎందుకంటే?

ఈ రసం తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయ్

ఖాళీ కడుపుతో లవంగాలను నమిలితే 7 ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments