Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వరకట్నం కోసం వేధింపులు.. పెళ్లైన ఆరునెలలకే నవ వధువు మృతి

Advertiesment
వరకట్నం కోసం వేధింపులు.. పెళ్లైన ఆరునెలలకే నవ వధువు మృతి
, బుధవారం, 12 మే 2021 (11:52 IST)
వరకట్నం వేధింపుల కేసులు తగ్గట్లేదు. కట్నం పిశాచులు అదనపు కట్నం కోసం భార్యలను వేధిస్తునే ఉన్నారు. తాజాగా కర్ణాటకాలోని దొడ్డ తాలూకా దొడ్డబెళవంగల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వరకట్న దాహానికి మోనిషా (20) అనే నవ వధువు బలైంది.
 
కసాఘట్ట గ్రామానికి చెందిన ముత్తేగౌడ ఇటీవలే మోనిషా అనే యువతిని వివాహం చేసుకుంది. వారి తల్లిదండ్రులకు ఆమె ఒక్కరే కుమార్తె కావడంతో ఘనంగా వివాహం జరిపించారు. భారీగానే కట్నకానుకలు కూడా సమర్పించారు.
 
పెళ్ళి తర్వాత కొన్ని రోజులు బాగానే ఆ తర్వాత అతని అసలు రంగు బయట పడింది. డబ్బు తేవాలని భార్యను వేధించసాగాడు. అయితే అతని కోరిన డబ్బులను ఆరునెలల్లో పలుమార్లు ఇచ్చామని మోనిషా తల్లిదండ్రులు తెలిపారు. తాము ఉంటున్న ఇల్లును కూడా తన పేరిన రాయలంటూ అతను ఒత్తిడిచేయడంతో మోనిషా తమ దగ్గరకు వచ్చేసిందని వారు తెలిపారు. 
 
తర్వాత పెద్దలు పంచాయితీతో రాజీచేసి ఆమెను తిరిగి అత్తవారింటికి పంపారు. ఇక మంగళవారం అత్తమామలకు ఫోన్‌చేసిన ముత్తేగౌడ మోనిషా చనిపోయిందని తెలిపాడు. 
 
కూతురు మరణంపై అనుమానం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు మోనిషా ఎప్పుడు ఫిట్స్‌ రాలేదని, భర్త, కుటుంబ సభ్యులే హత్యచేసి ఉంటారని వారు ఆరోపించారు. అలాగే వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శుభవార్త చెప్పిన కేంద్రం : కరోనా వైరస్ క్రమంగా తగ్గుముఖం