పదేళ్ల జర్నీ పూర్తి చేసుకున్న సుప్రీమ్ హీరో సాయిదుర్గ తేజ్

ఠాగూర్
గురువారం, 14 నవంబరు 2024 (19:03 IST)
సుప్రీమ్ హీరో సాయిదుర్గ తేజ్ తెలుగు చిత్ర పరిశ్రమలో పదేళ్ల జర్నీ పూర్తి చేసుకున్నారు. ఆయన హీరోగా నటించిన "పిల్లా నువ్వులేని జీవితం" సినిమా రిలీజై గురువారంతో పదేళ్లవుతోంది. 2014, నవంబరు 14వ తేదీన ఈ సినిమా తెరపైకి వచ్చింది. తొలి చిత్రంతోనే తన నటన, డ్యాన్సులతో ప్రేక్షకుల్ని సాయిదుర్గ తేజ్ ఆకట్టుకున్నారు. ఆల్ రౌండ్ పర్ ఫార్మెన్స్‌ కారణంగా ఈ చిత్రం సూపర్ హిట్ సాధించింది. 
 
ఆ తర్వాత సుప్రీమ్, చిత్రలహరి, ప్రతిరోజు పండగే, విరూపాక్ష వంటి సూపర్ హిట్ చిత్రాలతో తన స్టార్ డమ్ పెంచుకున్నారు. మేనమామ పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో కలిసి "బ్రో" చిత్రంలో నటించి తన డ్రీమ్ నెరవేర్చుకున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 18వ సినిమా ఎస్డీటీ 18 భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా రూపొందుతోంది. 
 
సాయిదుర్గ తేజ్ కెరీర్‌లోనే ఈ సినిమా ప్రతిష్టాత్మకంగా నిర్మాణమవుతోంది. తన సినిమాలతో పాటు సేవా కార్యక్రమాలతోనూ ప్రజల మనసులు గెల్చుకున్నారు. ఆయన 10 ఏళ్ల నట ప్రయాణం సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులు, సహ నటీనటులు, దర్శక నిర్మాతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అదేసమయంలో హైదరాబాద్ నగరంలో జరిగిన బైక్ ప్రమాదంలో తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మంత్రి కొండా సురేఖపై సీఎం రేవంత్ గుర్రు : మంత్రివర్గం నుంచి ఔట్?

విశాఖలో Google AI, 200 ఉద్యోగాలకు ఏడాదికి రూ.22,000 కోట్లా?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న

లైట్స్, కెమెరా, అబుధాబి: రణ్‌వీర్ సింగ్‌తో ఎక్స్‌పీరియన్స్ అబుధాబి కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా దీపికా పదుకొణె

శ్రీవారి ప్రసాదం ధర పెంపు? క్లారిటీ ఇచ్చిన తితిదే చైర్మన్

ఇన్‌స్టాగ్రాంలో ఎవడితో చాటింగ్ చేస్తున్నావ్, భర్త టార్చర్: వివాహిత ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments