Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్‌బాబును ఏడిపించిన వ్యక్తి ఎవరు?

Webdunia
ఆదివారం, 5 మే 2019 (09:02 IST)
ఎప్పుడూ నవ్వుతూ గ్లామర్‌గా ఉండే ప్రిన్స్‌ మహేష్‌ బాబును ఓ వ్యక్తి ఏడిపించాడు. అది కూడా రెండు సార్లు అలా చేశాడు. ఇంతకీ ఎవరా వ్యక్తి అని తెలుసుకోవాలనుందా? ఆయనెవరో కాదు. దర్శకుడు వంశీ పైడిపల్లి. 
 
'మహర్షి' కథను ముందుగా మహేష్‌బాబుకు చెప్పాలనుందని వంశీ అడగ్గా.. ఏదో 10 నిముషాలు విని వద్దులే అని చెబుదాం అనుకున్నాడట. కానీ వంశీ కథ చెప్పాక.. ఎక్సైట్‌ అయ్యాడు. అవ్వడమేకాకుండా కథ వింటుండగా అనుకోకుండా కళ్ళవెంట నీళ్ళు వచ్చేశాయి. దాంతో మహేష్ అంతకుముందు వేరే సినిమా చేయాలనుకున్నది కూడా పక్కన పెట్టేసి.. వెంటనే వంశీకి డేట్స్‌ ఇచ్చేశాడు. 
 
ఆ తర్వాత షూటింగ్‌ పూర్తయి.. డబ్బింగ్‌ చెబుతుండగా మరలా అదే సీన్‌ రిపీట్‌ అయింది. ఈసారి ఒకటికి రెండు సార్లు డబ్బింగ్‌ సరిచూసుకుంటుండగానే భళ్ళున కళ్ళలోని నీరు వచ్చేశాయి. ఆ సీన్‌ డబ్బింగ్‌ కోసం బాగా కష్టపడ్డాడట. దాంతో అక్కడివారు కూడా బాగా కనెక్ట్‌ అయ్యాయి, వారు కూడా ఫీలయ్యారట. వారే ఇంతగా ఫీలయితే మే 9వ తేదీన ప్రేక్షకుడుకూడా అలా కనెక్ట్‌ అవుతారని డబ్బింగ్‌ స్టూడియోవారే చెప్పారు. ఈ చిత్రం మానవీయకోణమున్న ప్రతి ఒక్కరినీ టచ్‌ చేస్తుందని మహేష్‌ చెప్పుకొచ్చాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

44 గ్రామాల్లో తాగునీటి సంక్షోభం- స్పందించిన పవన్ కల్యాణ్ (video)

WhatsApp : వాట్సాప్‌ను నిషేధించనున్న రష్యా ప్రభుత్వం..

18 Kilometers : 200 మంది విద్యార్థులు.. 18 కిలోమీటర్లు నడిచారు..

Christmas : చంద్రబాబు, పవన్, జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు

Christmas: పౌరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments