Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ‌రణ్ కుమార్ కొత్త చిత్రం పోస్టర్‌ను ఆవిష్క‌రించిన సూప‌ర్‌స్టార్ కృష్ణ‌

Webdunia
ఆదివారం, 8 ఆగస్టు 2021 (17:03 IST)
Krishna released poster
సూపర్‌స్టార్ కృష్ణ‌, విజ‌య‌నిర్మల ఫ్యామిలీ నుంచి శ‌రణ్ కుమార్ హీరోగా ప‌రిచయం అవుతున్న సినిమాలో హీరో లుక్ పోస్ట‌ర్‌ను ఆదివారం సూప‌ర్‌స్టార్ కృష్ణ విడుద‌ల చేశారు. శివ కేశ‌న కుర్తి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ వెన్నెల క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఎం.సుధాక‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ‌హేశ్ పుట్టిన‌రోజు (ఆగ‌స్ట్‌9) సంద‌ర్భంగా ఈ సినిమాలో హీరో లుక్‌ను సూప‌ర్‌స్టార్ కృష్ణ రిలీజ్‌ చేశారు. హీరో త‌ల‌కి చిన్న‌గాయ‌మైన‌ట్లు బ్యాండేజ్ వేసుకుని నిల‌డి ఉంటే పోస్ట‌ర్‌లో జ‌నాలు, రెండు వాహ‌నాలు వెళ్ల‌డం ఇవ‌న్నీ సినిమాపై ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి. 
 
ఈ సంద‌ర్భంగా కృష్ణ మాట్లాడుతూ, శరణ్ హీరోగా చేస్తోన్న సినిమా హీరో లుక్ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఇది త‌న‌కు హీరోగా ప‌ర్‌ఫెక్ట్ ల్యాండింగ్ అవుతుంది. శ‌రణ్ యాక్ట‌ర్‌గా చాలా మంచి పేరు తెచ్చుకోవాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.
 
నిర్మాత ఎం.సుధాక‌ర్ రెడ్డి మాట్లాడుతూ, శరణ్‌కుమార్ హీరోగా చేస్తున్న ఈ సినిమా హీరో లుక్ పోస్టర్‌ను మ‌హేశ్‌గారి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా సూప‌ర్‌స్టార్ కృష్ణ‌గారు విడుద‌ల చేయ‌డం ఆనందంగా ఉంది. సూప‌ర్‌స్టార్ ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇస్తోన్నశ‌ర‌ణ్‌కు ఈ సినిమా క‌చ్చితంగా మంచి బ్రేక్ ఇస్తుంది. అలాగే న‌రేశ్‌, జ‌యసుధ‌, సుధీర్‌బాబుగారు మా టీమ్‌ను ప్ర‌త్యేకంగా అభినందించ‌డం హ్య‌పీగా ఉంది. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించి మ‌రిన్ని విష‌యాల‌ను తెలియ‌జేస్తాం’’ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Gaddar Awards: గద్దర్ అవార్డులకు దరఖాస్తులు ఎలా చేసుకోవాలి?

అరుణాచల కొండపై విదేశీ మహిళపై గైడ్ అఘాయిత్యం!

Mamata Banerjee: సునీతా విలియమ్స్‌కు భారత రత్న అవార్డును ప్రదానం చేయాలి

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ సమీపంలో అశోక్ లేలాండ్ బస్సు తయారీ ప్లాంట్‌ ప్రారంభం

కాశ్మీర్‌లో జష్న్-ఎ-బహార్ సీజన్, తులిప్ గార్డెన్‌లో లక్షల తులిప్‌ పుష్పాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments