వీరాభిమానికి రజినీకాంత్ పాదాచాలనం.. ఫోటో వైరల్

Webdunia
మంగళవారం, 3 డిశెంబరు 2019 (09:25 IST)
సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్... మరోమారు వార్తల్లోకెక్కారు. ఎంత ఎత్తుకు ఎదిగినా అంత సాదాసీదాగా ఉండే తలైవా.. ఇపుడు తన వీరాభిమానికి పాదాచాలనం చేసి హిమాలయా శిఖరమంత ఎత్తుకు ఎదిగిపోయారు. ప్రత్యేక ప్రతిభావంతుడుగా గుర్తింపు పొందిన ఓ వీరాభిమానికి రజినీకాంత్ పాదాచాలనం చేశారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, పుట్టినతేదీ ప్రకారం ఈ నెల 12వ తేదీన రజినీకాంత్ పుట్టినరోజు వేడుకలు జరుగనున్నాయి. ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆయన అభిమాన సంఘాలు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి. 
 
అయితే, ఈ సూపర్ స్టార్ మాత్రం తన పుట్టిన తిథి, నక్షత్రం ప్రకారం సోమవారం రోజు పుట్టిన రోజును జరుపుకున్నారు. చెన్నైలోని తన నివాసంలో జరిగిన ఓ కార్యక్రమంలో కేరళకు చెందిన వీరాభిమానిని ప్రత్యేకంగా పిలిపించుకుని కలిశారు. 
 
ఈ వీరాభిమాని ప్రత్యేక ప్రతిభావంతుడు కూడా. ఇతనికి రజినీకాంత్‌తో కరచాలనం చేసేందుకు రెండు చేతులు లేవు. దీంతో రజనీ అతని పాదాలను తాకి పాదచాలనం చేశారు. అతనితో కాసేపు ముచ్చటించారు. 
 
ఈ పాదాచాలానికి సంబంధించిన ఫోటోలు మాత్రం ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, హీరో అయిన రాఘవ లారెన్స్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశంలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు సమయం ఆసన్నమైంది : పవన్ కళ్యాణ్

నా ముందు ప్యాంట్ జిప్ తీస్తావా? చీపురుతో చితక్కొట్టిన పారిశుద్ధ్య కార్మికురాలు (video).. ఎక్కడ?

కొత్త ఇల్లు కట్టావ్ లక్ష ఇస్తావా లేదా? ఇవ్వనన్నందుకు యజమానిని చితక్కొట్టిన హిజ్రాలు

Low Pressure: బంగాళాఖాతంలో నవంబర్ 19 నాటికి అల్పపీడనం

నిద్రపోతున్నప్పుడు భారీ వస్తువుతో దాడి.. టైల్ కార్మికుడు హత్య.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

తర్వాతి కథనం
Show comments