Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ సినిమాలో నేను చాలా కష్టపడి నటించాను: సమంత

Webdunia
సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (14:12 IST)
నా కేరీర్‌లోనే మొదటిసారిగా ఒక పాత్రకోసం నేను చాలా కష్టపడి నటించానని నటి సమంత పేర్కొన్నారు. ప్రస్తుతం సమంత బహుభాషా నటిగా రానున్న సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా తమిళం, తెలుగు భాషల్లో ప్రముఖ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. గత ఏడాది సమంత నటించిన చిత్రాలన్నీ సక్సెస్ బాటలో నడిపించాయి. ఈ సంవత్సరం కూడా అదే రీతిలో హిట్ సాధించాలని సమంత ఆశ పడుతోంది.
 
ఇటీవలే తన భర్త నాగచైతన్యతో నటించిన మజిలీ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. దీని విజయం సమంతకు చాలా ముఖ్యం. అయితే సమంత కష్టపడి నటింటిన చిత్రం మాత్రం ఇదికాదు. ఫేమ్ త్యాగరాజన్ కామరాజా దర్శకత్వంలో విజయ్ సేతుపతికి జోడిగా అరండకాండం చిత్రంలో నటిస్తోంది.
 
ఇందులో ఫాహత్ ఫాజిల్ కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం డబ్బింగ్ దశలో ఉంది. ఇందులో విజయ్ సేతుపతి మొదటిసారిగా హిజ్రాగానూ కొంచెం సేపు కనిపించనున్నారు. ఈ సినిమాలో నటి సమంత పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందట. ఇంతకు ముందు నటించిన చిత్రాలకంటే ఈ సినిమాలో నేను చాలా కష్టపడి నటించానని సమంత ఇటీవలే ఓ భేటీలో వెల్లడించారు. 
 
ఈ సినిమాలోని వేంబు అనే పాత్ర కోసం దర్శకుడి సలహా మేరకు రిహార్సల్స్ చేసి నటించానని.. ఈ పాత్ర తనకే కాకుండా తన అభిమానులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుందనే సమంత తన అభిప్రాయాన్ని తెలిపారు. ఇక సూపర్ డీలక్స్ చిత్రం సమర్మ్‌కు ప్రేక్షకుల ముందుకు రానుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మిథున్ రెడ్డికి కొత్త పరువు - దిండ్లు - ప్రొటీన్ పౌడర్ - కిన్లే వాటర్ - దోమతెర కావాలి...

మేనల్లుడుతో ప్రేమ - భర్త - నలుగురు పిల్లలు వదిలేసి పారిపోయిన వివాహిత!!

karnataka heart attacks, 32 ఏళ్ల యోగా టీచర్ గుండెపోటుతో మృతి

మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయం : శాఫ్ చైర్మన్ రవి నాయుడు

కళ్లు కనిపించట్లేదా.. చెత్తను ఎత్తుతున్న మహిళపై కారును పోనిచ్చాడు.. టైర్ల కింద? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments