Webdunia - Bharat's app for daily news and videos

Install App

మలయాళంలో ఎంట్రీ ఇవ్వనున్న సన్నీ లియోన్

పోర్న్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ వైపు అడుగులు వేసిన హీరోయిన్ సన్నీ లియోన్. ఈమె ఇప్పటికే హిందీ, తెలుగు చిత్రాల్లో నటించింది. ముఖ్యంగా, బాలీవుడ్‌లో ఆమెకు మంచి పేరు గుర్తింపు కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో ఆమ

Webdunia
శనివారం, 4 ఆగస్టు 2018 (13:05 IST)
పోర్న్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ వైపు అడుగులు వేసిన హీరోయిన్ సన్నీ లియోన్. ఈమె ఇప్పటికే హిందీ, తెలుగు చిత్రాల్లో నటించింది. ముఖ్యంగా, బాలీవుడ్‌లో ఆమెకు మంచి పేరు గుర్తింపు కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ పోర్న్ స్టార్‌ను ప్రముఖ దర్శకుడు మాలీవుడ్‌కు పరిచయం చేయనున్నాడు. ఆ దర్శకుడు ఎవరోకాదు... ఒమర్ లులు.
 
ఈయన 'ఒరు లవ్ ఆదార్‌' అనే చిత్రంతో ప్రియా ప్రకాష్ వారియర్‌ను వెండితెరకు పరిచయం చేశాడు. ఈ చిత్రం టీజర్‌లో ఒక్కసారి కన్నుగీటి కోట్ల మంది ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది ప్రియా ప్రకాష్ వారియర్. అలాంటి దర్శకుడు ద్వారా సన్నీ లియోన్ మాలీవుడ్‌కు పరిచయంకానుంది. 
 
జయరామ్‌, ధర్మజన్‌ బోయ్‌గట్టీ, హనీరోజ్‌, వినయ్‌ ముఖ్యతారలుగా ఓ కామెడీ ఎంటర్‌టైనర్‌ తెరకెక్కించడానికి ఒమర్‌ లులు సన్నాహాలు చేస్తున్నారు. అందులో మరో ముఖ్య పాత్రకు సన్నీని తీసుకుంటున్నారట.
 
నిజానికి, ఈ పాత్రకు ప్రముఖ శృంగార తార మియా ఖలీఫాను తీసుకోవాలనుకున్నారు. కానీ, మనసు మార్చుకుని సన్నీ లియోన్‌తో చేయించాలనే నిర్ణయానికి వచ్చారని చిత్ర సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. 
 
కేరళలోని కొచ్చిలో ఓ షోరూమ్‌ ప్రారంభోత్సవానికి సన్నీ లియోన్‌ వెళ్లగా... ప్రేక్షకులు వేల సంఖ్యలో హాజరయ్యారు. రోడ్ల మీద బారులు తీరారు. అక్కడ ఆమెకు ఎంత క్రేజ్‌ ఉందని చెప్పడానికి అదొక ఉదాహరణ. ఎప్పటినుంచో సన్నీ లియోన్‌ మలయాళ సినిమా చేయనున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇన్నాళ్లకు అవి నిజం కాబోతున్నాయన్నమాట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

YSRCP MLAs: శాసనసభ్యులకు అరకు కాఫీతో పాటు ఐప్యాడ్‌లు, గిఫ్ట్ హ్యాంపర్స్

మరిదిపై మోజు పడిన వొదిన: ఆమె కుమార్తెను గర్భవతిని చేసిన కామాంధుడు

Netumbo: నమీబియాకు తొలి మహిళా అధ్యక్షురాలిగా నంది-న్దైత్వా ప్రమాణం

UP Horror: 52 ఏళ్ల వ్యక్తిని చంపేసిన బావమరిది, అత్త హత్య చేశారు..

Jagan Letter: డీలిమిటేషన్ ప్రక్రియతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం.. మోదీకి జగన్ లేఖ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం