Webdunia - Bharat's app for daily news and videos

Install App

సన్నీ లియోన్ తాట తీస్తామంటున్న బెంగుళూరువాసులు .. ఎందుకు?

పోర్న్ స్టార్ నుంచి బాలీవుడ్ స్టార్‌గా మారిన సన్నీ లియోన్‌కు బెంగుళూరు వాసులు గట్టి వార్నింగ్ ఇచ్చారు. కొత్త సంవత్సరం రోజున సన్నీ తమ కంటికి కనిపిస్తే తాటతీస్తామంటూ హెచ్చరిస్తున్నారు. దీనికి ఓ కారణం లే

Webdunia
శుక్రవారం, 15 డిశెంబరు 2017 (21:12 IST)
పోర్న్ స్టార్ నుంచి బాలీవుడ్ స్టార్‌గా మారిన సన్నీ లియోన్‌కు బెంగుళూరు వాసులు గట్టి వార్నింగ్ ఇచ్చారు. కొత్త సంవత్సరం రోజున సన్నీ తమ కంటికి కనిపిస్తే తాటతీస్తామంటూ హెచ్చరిస్తున్నారు. దీనికి ఓ కారణం లేకపోలేదు. 
 
సాధారణంగా కొత్త సంవత్సరం వస్తుందంటే న్యూఇయర్ సెలెబ్రేషన్స్ దేశ వ్యాప్తంగా తారా స్థాయిలో జరుగుతుంటాయి. ఇలాంటి వేడుకల్లో సన్నీ డ్యాన్స్ షోకు భారీ డిమాండ్ ఉంటుంది. గత ఏడాది హైదరాబాద్ వచ్చిన సన్నీ.. ఈ యేడాది బెంగుళూరులో జరిగే ఓ ఈవెంట్‌కు హాజరుకానుంది. 
 
దీనిపై కర్ణాటక రక్షణ వేదిక యువసేన (కరవే) ఆందోళనకు దిగింది. కొత్త ఏడాది వేడుకల్లో సన్నీ పాల్గొనేందుకు వీళ్లేదంటూ రోడ్డెక్కింది. సన్నీకి వ్యతిరేకంగా ఈవెంట్ నిర్వహకులను వార్నింగ్ ఇచ్చింది. ఒకవేళ న్యూ ఇయర్ వేడుకల్లో సన్నీ పాల్గొంటే.. అంతు చూస్తామని.. ఎంతకైనా తెగిస్తామని యువసేన హెచ్చరించింది.
 
కర్ణాటక సంస్కృతిని రక్షించుకోవాలంటే అలాంటి వాళ్లను ప్రోత్సహించడం ఎంతమాత్రమూ శ్రేయస్కరం కాదనేది యువనేన వాదన. కర్ణాటక రాష్ట్రంలోని పలు జిల్లా కేంద్రాల్లో సన్నీలియోన్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. ఆమె పోస్టర్లు, ఫొటోలు తగలబెట్టారు. తమ వార్నింగ్‌ను బేఖాతర్ చేసి సన్నీ బెంగుళూరుకు వస్తే మాత్రం తగిన బుద్ధి చెపుతామని హెచ్చరించారు. 
 
ఈ హెచ్చరికపై ఈవెంట్ నిర్వహకుడు హరీశ్ స్పందించారు. కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పలు కార్యక్రమాల్లో సన్నీలియోన్ పాల్గొన్నారనీ, అపుడు లేని అభ్యంతరం ఇపుడెందుకని ఆయన ప్రశ్నిస్తున్నారు. సంప్రదాయ దుస్తులు ధరించి.. కన్నడ పాటలకే సన్నీ డ్యాన్స్ చేస్తుందని.. ఇందుకు అభ్యంతరం చెప్పటం మంచిది కాదంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం