Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వార్ సినిమాలో సన్నీలియోన్.. హార్స్ రైడింగ్ నేర్చుకుంటుందట..

బాలీవుడ్ శృంగార తార సన్నీలియోన్ ఇప్పటికే టాలీవుడ్‌లో మెరిసిన సంగతి తెలిసిందే. తాజాగా కోలీవుడ్‌లో హీరోయిన్‌గా రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. గతంలో వడకరి అనే సినిమాలో ఓ పాటకు చిందేసిన సన్నీలియోన్..

Advertiesment
Sunny Leone
, సోమవారం, 4 డిశెంబరు 2017 (11:38 IST)
బాలీవుడ్ శృంగార తార సన్నీలియోన్ ఇప్పటికే టాలీవుడ్‌లో మెరిసిన సంగతి తెలిసిందే. తాజాగా కోలీవుడ్‌లో హీరోయిన్‌గా రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. గతంలో వడకరి అనే సినిమాలో ఓ పాటకు చిందేసిన సన్నీలియోన్.. హీరోయిన్‌గా మారనుంది. అదీ చారిత్రాత్మక సినిమాలో సన్నీ లియోన్ నటించనుందని కోలీవుడ్ వర్గాల్లో టాక్. ఈ చిత్రాన్ని వడివుడయాన్ అనే నిర్మాత నిర్మిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
 
ఈ చిత్రంలోసన్నీలియోన్ హార్స్ రైడింగ్, కత్తిసాము వంటివి నేర్చుకున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో ఈ సినిమా ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్‌పైకి రానుంది. ఇదే సినిమా తెలుగు, మలయాళం, హిందీల్లోనూ విడుదల కానుంది. 
 
ఈ సినిమా కోసం సన్నీలియోన్ 150 రోజుల కాల్షీట్ ఇచ్చింది. తెలుగులో కరెంట్ తీగ చిత్రంలో నటించిన సన్నీలియోన్.. పీఎస్‌వీ గరుడవేగ సినిమాలో ఓ పాటకు చిందేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన వీడియోను సన్నీ లియోన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. 

 
 

Yay! So excited to be starting a project like this!!

A post shared by Sunny Leone (@sunnyleone) on


Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్రేజీ కాంబినేషన్ : మహేష్ - బాలయ్య - బోయపాటిల చిత్రం?