Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాటకు ప్రాణం పోసిన స్వరం... హ్యాపీ బర్త్ డే టు ఘంటసాల

గానగంధర్వుడు ఘంటసాల. పాటకు ప్రాణం పోసిన స్వరం ఆయనది. ఆయన పాట అలసిన మనసును సేదతీరుస్తుంది. వెన్నెల్లో జోలపాడుతుంది. ముద్దుచేస్తూ గోరుముద్దలు తినిపిస్తుంది.

పాటకు ప్రాణం పోసిన స్వరం... హ్యాపీ బర్త్ డే టు ఘంటసాల
, సోమవారం, 4 డిశెంబరు 2017 (08:52 IST)
గానగంధర్వుడు ఘంటసాల. పాటకు ప్రాణం పోసిన స్వరం ఆయనది. ఆయన పాట అలసిన మనసును సేదతీరుస్తుంది. వెన్నెల్లో జోలపాడుతుంది. ముద్దుచేస్తూ గోరుముద్దలు తినిపిస్తుంది. కోటి వీణియలను తనలోనే దాచుకుని తుమ్మెద నాదమై మన చెవిని చేరుతుంది. వేణువులోకి దూరే పిల్లగాలులోలె సవ్వడి చేస్తుంది. ఉషోదయ సుప్రభాతమై నిద్రలేపుతుంది. భానుడి రవికిరణమై నులివెచ్చగా మదిని తాకుతుంది. తెలుగు సినిమా చరిత్రలో ఆణిముత్యాలన్నీ ఆ గొంతుక నుంచి జాలువారినవే. తన పాటను ప్రతినోట పలికించి కంఠశాలగా నిలిచారు గంధర్వ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు. 
 
ఈయన 1922 డిసెంబర్ 4న గుడివాడ సమీపంలోని చౌటపల్లిలో జన్మించారు. ఆయన నాన్నగారు నాటకాలలో మృదంగం వాయిస్తూ, భజనలు చేస్తూ ఉండేవారు. తండ్రి నుంచే సంగీతంపై ఆసక్తి కలిగింది. 11వ యేటే తండ్రి చనిపోయారు. ఆయన కిచ్చిన మాటకోసం సంగీత విధ్వాంసుడవ్వాలన్న పట్టుదలతో ఎన్నో కష్టాలకోర్చి అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. ప్లే బ్యాక్ సింగర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా తెలుగు సినీ పరిశ్రమలతో తనకంటూ ఓ స్థానం కల్పించుకున్నారు.
 
ప్రముఖ సినీగేయ రచయిత సముద్రాలతో స్నేహం ఘంటసాల కెరీర్‌ను మలుపుతిప్పింది. 'సీతారామజననం'లో కోరస్ పాడే అవకాశం దొరికింది. ఆ తర్వాత ఛాన్స్ వచ్చినప్పుడల్లా సినిమాల్లో చిన్న చిన్న వేశాలు వేసుకుంటూ గడిపారు. 'స్వర్గసీమ' సినిమాకు తొలిసారి ప్లేబ్యాక్ సింగర్ అవకాశం దక్కింది. 'పాతాళభైరవి' సినిమాతో ఘంటసాల పేరు ఆంధ్రదేశమంతా మారుమోగింది. ఘంటసాల గాత్ర మాధుర్యం సినిమాను ప్రజలకు దగ్గర చేసింది. 
 
ఆ తర్వాత 'మల్లీశ్వరి', 'దేవదాసు', 'అనార్కలి' చిత్రాల్లోని పాటలు మైల్ స్టోన్ గా నిలిచాయి. 1957లో రిలీజైన మాయాబజార్ పాటలు ఇక చెప్పాల్సిన పనిలేదు. 'లవకుశ', 'పాండవ వనవాసం', 'రహస్యం', 'గుండమ్మ కథ', 'పరమానంద శిష్యుల కథ'. ఇలా 1950 నుంచి 1960 వరకు ఘంటసాల  సంగీత ప్రభంజనం కొనసాగింది.
 
'జగదేక వీరుని కథ' చిత్రం కోసం కంపోజ్  చేసిన ‘శివశంకరీ శివానంద లహరి..' ప్రపంచంలో సంగీత ప్రేమకులందర్నీ అలరించిన పాట. సింగిల్  టేక్‌లో పాడి రికార్డు సృష్టించాడు. కన్నడ సంగీతంతో పాటు హిందూస్థానీ, కర్ణాటక క్లాసికల్‌శైలిలో అనితర సాధ్యంగా కంపోజ్  చేయబడిన పాటను ఘంటసాల పాడిన విధానానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. పౌరాణిక, సాంఘిక, జానపద, చారిత్రాత్మక చిత్రాల్లో తెలుగు, తమిళ పాటలు కలిసి 13 వేలకు పైగా పాటలు పాడారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవర్ స్టార్‌ పవన్‌తో ప్రఖ్యాత దర్శకుడి భార్య...