Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైవా హర్ష హీరోగా మాస్ మహారాజ రవితేజ నిర్మిస్తున్న చిత్రం సుందరం మాస్టర్

Webdunia
బుధవారం, 12 జులై 2023 (11:31 IST)
Saitej, Harsha Chemudu, Divya Sripada
హ‌ర్ష చెముడు, దివ్య శ్రీపాద ప్ర‌ధాన తారాగ‌ణంగా ఆర్‌.టి.టీమ్ వ‌ర్క్స్‌, గోల్ డెన్ మీడియా బ్యాన‌ర్స్‌పై క‌ళ్యాణ్ సంతోష్ దర్శ‌క‌త్వంలో ర‌వితేజ‌, సుధీర్ కుమార్ కుర్రు నిర్మాత‌లుగా రూపొందుతోన్న చిత్రం ‘సుందరం మాస్టార్’. 

సుందరం అనే టీచర్ చుట్టూ నడిచే కథే ఇది. తను గవర్నమెంట్ టీచర్. సోషల్ స్టడీస్ బోధిస్తుంటాడు. అయితే మిర్యాల మెట్ట అనే మారుమూల పల్లెలో ఇంగ్లీష్ టీచర్‌గా వెళ్లాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంది. అందులో అన్నీ వ‌య‌సుల‌వారు ఇంగ్లీష్ నేర్చుకోవ‌టానికి విద్యార్థులుగా వ‌స్తారు. మ‌రి సుంద‌రం మాస్టార్ వారికెలా ఇంగ్లీష్‌ను బోధించారు అనే విష‌యం ఎంట‌ర్‌టైనింగ్‌గా రూపొందించిన చిత్ర‌మే ఇది. ఈ సినిమా టీజ‌ర్‌ను సుప్రీమ్ హీరో సాయితేజ్ విడుద‌ల చేశారు. టీజ‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మం వైజాగ్‌లో జ‌రిగింది.
 
హీరో సాయితేజ్ మాట్లాడుతూ ‘‘సుందరం మాస్టర్ టీజర్ రిలీజ్ చేయటానికి ఐదు కార‌ణాలు, అక్ష‌ర‌, ర‌మ‌గారు, రావుగారు మొద‌టి మూడు కార‌ణాలు. హ‌ర్ష వాళ్ల‌బ్బాయే. త‌ను బాగా న‌టిస్తాడు. ఇంకా మంచి స్థాయికి చేరుకుంటాడ‌ని ఆశిస్తున్నా వాళ్ల‌కి ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను. ఇక నాలుగో కార‌ణం.. నా ఫేవ‌రెట్ హీరో ర‌వితేజ‌గారు. ఆయ‌న నాకు చాలా చిన్న చిన్న విలువైన విష‌యాల‌ను నేర్పించారు. ఆయ‌న కోసం ఇక్క‌డ‌కు వ‌చ్చాను. ఐదో కార‌ణం.. ప్రేక్ష‌కుల ప్రేమను పొంద‌డానికే వచ్చాను. మా సుంద‌రం మాస్ట‌ర్ టీమ్‌.. డైరెక్ట‌ర్ క‌ళ్యాణ్ సంతోష్‌, సుధీర్ వ‌ర్మ‌గారికి, మ్యూజిక్ డైరెక్ట‌ర్ శ్రీచ‌ర‌ణ్‌గారికి.. అంద‌రికీ మీ ప్రేమ‌ను అందిస్తార‌ని భావిస్తున్నాను’’ అన్నాను. 
 
హర్ష చెముడు మాట్లాడుతూ,  నా త‌ల్లిదండ్రులు, నా భార్య అంద‌రూ నా బిహేవియ‌ర్‌ను భ‌రించారు. క‌ళ్యాణ్ స్క్రిప్ట్ నెరేట్ చేసినప్పుడు నువ్వే హీరో అన్నాడు. ఊరుకో బాసూ! ఏం మాట్లాడుతున్నావ్ అన్నాను. పూర్తి క‌థ విన్న త‌ర్వాత ఎవ‌రికీ చెప్ప‌కు ఇది నేనే చేస్తాను అని అన్నాను. అంత బాగా ఉంది. వైవా రిలీజ్ అయ్యి 10 ఏళ్లు అవుతుంది. ప‌దేళ్ల ముందు షార్ట్ ఫిల్మ్ వ‌స్తే.. 10 ఏళ్లలో మీరు న‌న్ను ఇక్క‌డ నిలుచో బెట్టారు. క‌ష్ట‌ప‌డితే అంద‌రూ మీ ల‌క్ష్యాల‌ను చేరుకుంటారు. నాకు ఇది చాలా ఎమోష‌న‌ల్ మూమెంట్‌. క‌ళ్యాణ్ స్క్రిప్ట్‌ను బ్యూటీఫుల్‌గా రాస్తే సుధీర్‌గారు, మాస్ మ‌హారాజా ర‌వితేజ‌గారు అద్భుతంగా నిర్మించారు. ర‌వితేజ‌గారు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వ‌చ్చి.. ఇక్క‌డ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని వారికి స‌పోర్ట్ అందిస్తున్నారు. మా టీమ సినిమా కోసం ప‌డ్డ క‌ష్టం ముందు నేను న‌థింగ్‌. స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్‌. సాయి బ్రో వ‌చ్చి టీజ‌ర్ విడుద‌ల చేసినందుకు థాంక్స్‌’’ అన్నారు.
 
చిత్ర దర్శకుడు కళ్యాణ్ సంతోష్ మాట్లాడుతూ, శ్రీచ‌ర‌ణ్ పాకాల‌గారు అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. ఈ సినిమా ఇంత బాగా రావ‌టానికి మెయిన్ రీజ‌న్ ముగ్గురు వ్య‌క్తులు. అందులో మొద‌టివాడు హ‌ర్ష‌. ర‌వితేజ‌గారు, న‌న్ను న‌మ్మి సుధీర్ వ‌ర్మ‌గారు సినిమాను ఇంత వ‌ర‌కు తీసుకొచ్చారు. ఆయ‌న నా స‌పోర్ట్ సిస్ట‌మ్‌గా నిలిచారు. మా సినిమాకు స‌పోర్ట్ చేస్తున్న ఆయ‌న‌కు థాంక్స్‌’’ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments