Webdunia - Bharat's app for daily news and videos

Install App

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

దేవీ
గురువారం, 3 ఏప్రియల్ 2025 (18:20 IST)
Sumaya Reddy, Kamal
కొత్త పాయింట్‌తో ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీగా ‘డియర్ ఉమ’ చిత్రం తెరకెక్కింది. తెలుగమ్మాయి అయిన సుమయ రెడ్డి హీరోయిన్‌గా, నిర్మాతగా, రచయితగా చేసిన ఈ చిత్రం ప్రస్తుతం ఆడియెన్స్ ముందుకు రానుంది. అలా మల్టీ టాలెంటెడ్‌ తెలుగమ్మాయి సుమయ రెడ్డి ఈ మూవీని సుమ చిత్ర ఆర్ట్స్ బ్యానర్ మీద నిర్మించారు. ఇందులో సుమయ రెడ్డి, పృథ్వీ అంబర్ జంటగా నటించారు. ఈ మూవీకి నిర్మాతగా సుమయ రెడ్డి.. లైన్ ప్రొడ్యూసర్‌గా నగేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా నితిన్ రెడ్డి వ్వవహరించారు.

ఇక ఈ సినిమాకు సాయి రాజేష్ మహాదేవ్ స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. ఇక ఎన్నో చిత్రాలకు అద్భుతమైన విజువల్స్ అందించిన రాజ్ తోట కెమెరామెన్‌గా, బ్లాక్ బస్టర్ చిత్రాలకు మ్యూజిక్ అందించిన రదన్ సంగీత దర్శకుడిగా పని చేశారు.
 
ఇప్పటికే డియర్ ఉమ నుంచి వచ్చిన పోస్టర్లు, గ్లింప్స్, పాటలు, టీజర్ సినిమా మీద అంచనాలు పెంచేసిన సంగతి తెలిసిందే. ఓ ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీని చూడబోతోన్నామని ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్ చెబుతోంది. మరి ఈ ప్రేమ కథను చూసే టైం వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను మేకర్లు తాజాగా ప్రకటించారు.
 
ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో పాటు చక్కని సందేశాన్ని ఇవ్వబోతోన్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 18న రిలీజ్ చేయబోతోన్నారు. హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో ఈ సినిమాను లవ్, ఫ్యామిలీ, యాక్షన్ డ్రామా ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కించారు. ఇక ఏప్రిల్ 18న ఈ మూవీని భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.
 
ఈ చిత్రంలో కమల్ కామరాజు, సప్త గిరి, అజయ్ ఘోష్, ఆమని, రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, రూప లక్ష్మీ వంటి వారు నటించారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

45 సెకన్ల సమయం తమ తలరాతను మార్చింది... పాక్ ప్రధాని సలహాదారు

పూణెలో దారుణం : కొరియర్ బాయ్ ముసుగులో వచ్చి యువతిపై అత్యాచారం

బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

తర్వాతి కథనం
Show comments