Webdunia - Bharat's app for daily news and videos

Install App

`అనగనగా ఓ రౌడీ`గా సుమంత్

Webdunia
సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (16:11 IST)
Sumanth, Anaganaga o rowdy
వైవిధ్యమైన చిత్రాలతో కథానాయకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును, క్రేజ్‌ను పొందిన హీరో సుమంత్ నటిస్తున్న మరో విభిన్నమైన చిత్రానికి `అనగనగా ఓ రౌడీ` అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఈ నెల 9న (మంగళవార) సుమంత్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ చిత్రానికి సంబంధించిన సుమంత్ లుక్‌తో ఓ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు.

మను యజ్ఞ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఏక్‌దోత్రీన్ ప్రొడక్షన్స్ పతాకంపై గార్లపాటి రమేష్, డా.టీఎస్ వినీత్ భట్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో వున్న ఈ చిత్రం విశేషాలను దర్శకుడు తెలియజేస్తూ సుమంత్ కెరీర్‌లో ఇదొక వైవిధ్యమైన చిత్రం. సుమంత్ పాత్ర పూర్తి రొటిన్‌కు భిన్నంగా వుంటుంది. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఆయన పాత్ర తప్పకుండా నచ్చుతుంది.
 
వాల్తేరు శ్రీనుగా, విశాఖపట్నం రౌడీగా ఆయన అభినయం అందర్ని అలరించే విధంగా వుంటుంది.  వైజాగ్‌లో జరిగే చివరి షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తవుతుంది అన్నారు. ఐమా నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో మధునందన్, ధన్‌రాజ్, కళ్యాణ్ చక్రవర్తి, హైపర్ ఆది, మిర్చి కిరణ్, ప్రభ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మార్క్.కె.రాబిన్, సహ నిర్మాత: విజయ్.కె.బి, రచన, దర్శకత్వం: మను యజ్ఞ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: భార్యాభర్తల గొడవలు నాలుగు గోడలకే పరిమితం కాదు.. హత్యల వరకు వెళ్తున్నాయ్!

ప్రధాని మోడీ మూడేళ్ళలో విదేశీ పర్యటన ఖర్చు రూ.295 కోట్లు

రాజ్యసభలో అడుగుపెట్టిన కమల్ హాసన్... తమిళంలో ప్రమాణం

లైంగిక సమ్మతి వయసు తగ్గించే నిర్ణయం సబబు కాదంటున్న అపెక్స్ కోర్టు

బీమా సొమ్ము కోసం కాళ్ళను తొలగించుకున్న వైద్యుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments