Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుకుమార్, ఆ సీన్స్ అన్నింటినీ క్యాన్సిల్ చేసాడా?

Webdunia
మంగళవారం, 10 మార్చి 2020 (21:27 IST)
క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్‌తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. అల.. వైకుంఠపురములో సినిమా సెట్స్ పైన ఉండగానే.. సుకుమార్‌తో సినిమాని స్టార్ట్ చేసాడు బన్నీ. సుకుమార్ అల్లు అర్జున్ లేకుండా మిగిలిన ఆర్టిస్టులతో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసాడు. సెకండ్ షెడ్యూల్ కేరళలో ప్లాన్ చేసాడు. త్వరలో సెకండ్ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నాడు.
 
అయితే.. సుకుమార్ ఇప్పటివరకు చేసిన ఈ సినిమా షూటింగ్‌ని అంతా క్యాన్సిల్ చేసారట. కారణం ఏంటంటే... తీసిన ఆ సీన్స్ సరిగా రాలేదట. ఈ విషయాన్ని సుకుమార్ బన్నీకి చెప్పగా.. ఓకే అన్నారట. ప్రస్తుతం మళ్లీ ఫస్ట్ నుంచి షూటింగ్ చేయడానికి ప్లాన్ చేసినట్టు సమాచారం. ఇందులో బన్నీ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి కానీ.. సుకుమార్ కానీ బన్నీ కానీ ఈ విషయం క్లారిటీ ఇవ్వలేదు.
 
బన్నీ సరసన రష్మిక నటిస్తుంది. త్వరలో రష్మిక కూడా ఈ మూవీ షూటింగ్‌లో జాయిన్ కానుంది. 
వీరిద్దరిపై చిత్రీకరించే సన్నివేశాలు యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉంటాయని సమాచారం. జగపతిబాబు, విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషిస్తున్నారని టాక్. దీనికి శేషాచలం అనే టైటిల్ ఖరారు చేసినట్టు వార్తలు వచ్చాయి కానీ.. ఆ తర్వాత ఆ వార్తలు వాస్తవం కాదు.. టైటిల్ ఇంకా కన్ఫర్మ్ కాలేదని చెప్పారు. మరి.. ఏ టైటిల్ పెడతారో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో పలుచోట్ల 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

నా భార్యను ఆమె ప్రియుడికిచ్చి ఎందుకు పెళ్లి చేశానంటే... వివరించిన భర్త (Video)

నా కూతురినే ప్రేమిస్తావా? చావు: గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి

అందాల పోటీలు నిలిపివేసి.. అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వాలన్న కేటీఆర్!!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments