Webdunia - Bharat's app for daily news and videos

Install App

నదిలో పడిన సుకుమార్.. ప్రాణాలకు తెగించి కాపాడిన హీరో.. ఎవరు?

షూటింగ్ సమయాల్లో వివిధ రకాల ప్రమాదాలు చోటుచేసుకుంటుంటాయి. ఇలాంటి ప్రమాదాల్లో కొందరు మృత్యువాతపడుతుంటే.. మరికొందరు గాయాలతో ప్రాణగండం నుంచి బయపడుతుంటారు.

Webdunia
ఆదివారం, 30 జులై 2017 (10:37 IST)
షూటింగ్ సమయాల్లో వివిధ రకాల ప్రమాదాలు చోటుచేసుకుంటుంటాయి. ఇలాంటి ప్రమాదాల్లో కొందరు మృత్యువాతపడుతుంటే.. మరికొందరు గాయాలతో ప్రాణగండం నుంచి బయపడుతుంటారు. అయితే, టాలీవుడ్‌కు చెందిన దర్శకుడు సుకుమార్ ఓ ప్రాణగండం నుంచి తప్పించుకున్నారు. ఆయన ప్రాణాలు రక్షించింది కూడా ఓ స్టార్ హీరోనే. ఆ హీరో ఎవరో కాదు అల్లు అర్జున్. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
సుకుమార్ నిర్మాణంలో "ద‌ర్శ‌కుడు" అనే చిత్రం రూపొంద‌గా ఈ మూవీని ఆగ‌స్ట్ 4న విడుద‌ల చేయ‌నున్నారు. అయితే శనివారం సాయంత్రం ఈ మూవీ ప్రీరిలీజ్ వేడుక‌ని గ్రాండ్‌గా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యాడు. ఫంక్ష‌న్ ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సాగుతుండ‌గా, సుకుమార్ 'ఆర్య' షూటింగ్ స‌మ‌యంలో జ‌రిగిన సంఘ‌ట‌న చెప్పి అందరికి షాక్ ఇచ్చాడు. 
 
'ఆర్య' సినిమా షూటింగ్ సమయంలో ప్ర‌మాద‌వ‌శాత్తు తాను పడవలోనుంచి నదిలో పడిపోయానని చెప్పాడు సుకుమార్. నాకు ఈత రాక‌పోగా , నేను ప‌డిపోవ‌డం చూసి అంతా షాక్‌కు గురై అందరూ అలాగే చూస్తుండిపోయారు. ఇక చివ‌రి క్ష‌ణాలు అవే అనుకుంటున్న స‌మ‌యంలో అల్లు అర్జున్ నదిలో దూకి త‌న‌ని ర‌క్షించాడ‌ని గుర్తు చేశాడు. అందుకే ఆయ‌నే నా రియ‌ల్ హీరో అని సుకుమార్ ఉద్వేగ భ‌రితంగా చెప్పాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments