విజయవాడ నేపథ్యంలో రైటర్ పద్మభూషణ్ గా సుహాస్

Webdunia
గురువారం, 29 డిశెంబరు 2022 (14:52 IST)
Suhas
చాయ్ బిస్కెట్‌ లో యూట్యూబ్ వీడియోలతో తన నటనా జీవితాన్ని ప్రారంభించిన సుహాస్, అద్భుతమైన ప్రతిభ గల నటుడిగా వైవిధ్యమైన పాత్రలు, చిత్రాలతో అందరినీ ఆకట్టుకున్నాడు. 'కలర్ ఫోటో'లో అద్భుతమైన నటన కనబరిచాడు. ఈ చిత్రం జాతీయ అవార్డును కూడా గెలుచుకుంది. ఇటివలే  హిట్-2లో అందరినీ ఆశ్చర్యపరిచాడు. హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న తన తాజా చిత్రం 'రైటర్ పద్మభూషణ్‌'లో స్ట్రగులింగ్ రైటర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమా థియేట్రికల్ విడుదల తేదీని ప్రకటించారు.
 
రైటర్ పద్మభూషణ్ ఫిబ్రవరి 3, 2023న థియేటర్లలోకి రానుంది. విడుదల తేదీ పోస్టర్ జీవితంలో పెద్ద లక్ష్యాలను కలిగి ఉన్న సాధారణ యువకుడిగా కనిపించాడు సుహాస్‌. చక్కని చిరునవ్వుతో ప్రకాశం బ్యారేజీపై నిలబడి పోజు ఇవ్వడం ఆకట్టుకుంది.
 
విజయవాడ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో టీనా శిల్పరాజ్ కథానాయికగా నటిస్తోంది. లహరి ఫిల్మ్స్ తో కలిసి చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. అనురాగ్, శరత్, చంద్రు మనోహర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మనోహర్ గోవిందస్వామి సమర్పిస్తున్నారు.
 
శేఖర్ చంద్ర సంగీతం అందించిన చిత్రంలోని ఫస్ట్ సింగిల్ కన్నుల్లో నీ రూపమే చార్ట్‌బస్టర్‌ గా నిలిచింది. ఈ చిత్రానికి వెంకట్ ఆర్ శాకమూరి సినిమాటోగ్రఫీ  అందిస్తున్నారు. చిత్రం  ట్రైలర్‌ ను త్వరలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
తారాగణం: సుహాస్, టీనా శిల్పరాజ్, ఆశిష్ విద్యార్థి, రోహిణి మొల్లేటి, గోపరాజు రమణ, శ్రీ గౌరీ ప్రియ

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

2027 గోదావరి పుష్కరాల కోసం ఏర్పాట్లు చేపట్టాలి.. రేవంత్ రెడ్డి ఆదేశాలు

నేపాల్‌లో ఘర్షణలు - హోటల్‌కు నిప్పు - భారత మహిళ మృతి

బంగాళాఖాతంలో అల్పపీడనం : ఏపీకి భారీ వర్ష సూచన

మేమంతా భారత రాష్ట్ర సమితిలోనే కొనసాగుతున్నాం.. ఫిరాయింపు ఎమ్మెల్యేల వివరణ

ఈ నెల 24 నుంచి తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

తర్వాతి కథనం
Show comments